Prashant Kishor: ఆయనపై వయసు ప్రభావం కనిపిస్తోంది.. సీఎంపై ప్రశాంత్ కిషోర్ సీరియస్ కామెంట్స్..
వయస్సు ప్రభావం నితిష్ కుమార్‌పై చాలా స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. అతను ఏదో చెప్పాలనుకుంటున్నారు.. మరొకటి మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మరోసారి నితీష్ కుమార్‌పై విరుచుకు పడ్డారు ప్రశాంత్ కిషోర్. వయస్సు ప్రభావం నితిష్ కుమార్‌పై చాలా స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. అతను ఏదో చెప్పాలనుకుంటున్నారు.. మరొకటి మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, ‘నేను బీజేపీ అజెండాపై పనిచేస్తున్నానని నితీష్ కుమార్ చెబుతున్నారు. అప్పుడు నేను తనను కాంగ్రెస్‌లో విలీనం చేయమని అడిగాను. నితీష్ అయోమయంలో పడి రాజకీయంగా ఒంటరిగా మారుతున్నారు. అతను విశ్వసించలేని వ్యక్తులు అతని చుట్టూ ఉన్నారు.
నితీశ్ పీకేపై ఆరోపణలు
అంతకుముందు ప్రశాంత్ కిషోర్ వారసుడి వాదనపై నితీష్ కుమార్ మాట్లాడుతూ అది అబద్ధమని అన్నారు. వాళ్లు ఏది చెప్పాలనుకున్నా అది మాట్లాడనీయండి. దానితో తనకు ఎలాంటి సంబంధం లేదు. ఒకరోజు పీకే తన వద్దకు వచ్చి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కోరారని పీకేపై ఆరోపణలు చేశారు నితీష్. 4-5 ఏళ్ల క్రితమే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయమని చెప్పారు.తన పార్టీని ఎందుకు కాంగ్రెస్‌లో విలీనం చేప్పాలని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
Age showing its effect on Nitishji, he wants to say something but he speaks something else.If I was working on BJP agenda why would I speak of strengthening the Congress? He is getting delusional & politically isolated. He’s surrounded by those whom he can’t trust:Prashant Kishor https://t.co/QnoooOiHjL pic.twitter.com/c4Nl9TEORC
— ANI (@ANI) October 9, 2022
నితీష్ కుమార్ vs ప్రశాంత్ కిషోర్
ఈ మధ్యకాలంలో మిషన్-2024లో నితీష్ కుమార్ బిజీగా ఉన్నారు. దీని ద్వారా విపక్ష నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చే పనిలో పడ్డారు. గతంలో కూడా ఆయన పలువురు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలను కలిశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే టార్గెట్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, ఈ రోజుల్లో నితీష్ కుమార్ వర్సెస్ ప్రశాంత్ కిషోర్ కూడా హాట్ హాట్‌గా సాగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం