EPFO : PF ఖాతాదారులకు శుభవార్త.. రూ.7లక్షల ఉచిత బీమా ప్రయోజనం.. వారికి కూడా వర్తింపు..

ఉద్యోగి అనారోగ్యం, ప్రమాదం లేదా సహజ మరణం సంభవించినప్పుడు ఉద్యోగి నామినీ తరపున EDLI (ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్) క్లెయిమ్ చేయవచ్చు. వారి మరణానికి ముందు 12 నెలల్లో ఒకటి కంటే

EPFO : PF ఖాతాదారులకు శుభవార్త.. రూ.7లక్షల ఉచిత బీమా ప్రయోజనం.. వారికి కూడా వర్తింపు..
EPFO
Follow us

|

Updated on: Oct 09, 2022 | 1:47 PM

మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో PF ఖాతాను కలిగి ఉన్నారా.? అయితే మీరు ఏమీ చేయకుండానే రూ.7 లక్షల రూపాయల ప్రయోజనాన్ని పొందవచ్చు. వాస్తవానికి, EPFO సభ్యులకు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) కింద బీమా రక్షణ సౌకర్యం అందించబడుతుంది. ఈ బీమా కవరేజీ కింద గరిష్టంగా రూ.7 లక్షలు నామినీకి చెల్లించబడుతుంది. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారికి కూడా రూ.7 లక్షల ఉచిత ప్రయోజనం లభిస్తుంది. ఉద్యోగి అనారోగ్యం, ప్రమాదం లేదా సహజ మరణం సంభవించినప్పుడు ఉద్యోగి నామినీ తరపున EDLI (ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్) క్లెయిమ్ చేయవచ్చు. వారి మరణానికి ముందు 12 నెలల్లో ఒకటి కంటే ఎక్కువ స్థాపనల్లో పనిచేసిన వారి కుటుంబాలకు కూడా ఈ కవర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. పథకంలోఉద్యోగి ఎటువంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో నామినేషన్ లేకపోతే మరణించిన ఉద్యోగి జీవిత భాగస్వామి, అవివాహిత కుమార్తెలు, మైనర్ కొడుకులకు కవరేజీ ఉంటుంది. హక్కుదారు మైనర్ అయితే, వారి తరపున తల్లిదండ్రులు క్లెయిమ్ చేయవచ్చు.

ఈ పత్రాలు అవసరం యజమానికి సమర్పించాల్సిన ఫారమ్‌తో పాటు బీమా కవర్ యొక్క ఫారమ్ 5 IF కూడా సమర్పించాల్సి ఉంటుంది. యజమాని ఈ ఫారమ్‌ను ధృవీకరిస్తారు. యజమాని అందుబాటులో లేకుంటే, గెజిటెడ్ అధికారి, మేజిస్ట్రేట్, గ్రామ పంచాయతీ చైర్మన్, మున్సిపాలిటీ ఛైర్మన్/సెక్రటరీ/సభ్యులు లేదా జిల్లా లోకల్ బోర్డు, పోస్ట్‌మాస్టర్ లేదా సబ్-పోస్ట్‌మాస్టర్ ఫారమ్‌ను ధృవీకరించాలి.

ఈ-నామినేషన్ సౌకర్యం EPFO ఇప్పుడు నామినీ వివరాలను అందించడానికి ఇ-నామినేషన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇందులో నమోదుకాని వారికి అవకాశం కల్పిస్తారు. దీని తర్వాత నామినీ పేరు, పుట్టిన తేదీ మొదలైన సమాచారం ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయబడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి