ఇంట్లో ఉండ‌కూడ‌ని చెట్లు ఇవి.. వీటితో కుటుంబస‌మ‌స్య‌లు, ఆర్థిక ఇబ్బందులు తప్పవు!

దుష్ట ప్రభావం కలిగించే చెట్లు ఉంటే ఇంట్లో సమస్యలు వస్తాయి. ఇవి ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని పెంచుతాయి. ఫలితంగా కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతి పెరిగిపోయి

ఇంట్లో ఉండ‌కూడ‌ని చెట్లు ఇవి.. వీటితో కుటుంబస‌మ‌స్య‌లు, ఆర్థిక ఇబ్బందులు తప్పవు!
Vastu Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 09, 2022 | 1:34 PM

ఇంటి ముందు అందమైన మొక్కలు ఉంటేఏ..ఆ ఇళ్లు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అంతేకాదు.. ఇంటి ముందు ఖాళీ స్థలంలో చెట్లు ఉండటం వలన మనసు ఉల్లాసంగా ఉంటుంది. పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. అలాగే స్వచ్చమైన గాలిని కూడా అందిస్తాయి. ఉదయాన్నే పచ్చటి మొక్కలు చూడడం.. వాటితో కాసేపు గడపడం శరీరానికి, మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది..అయితే, ఇంటికి వాస్తు ఎంతముఖ్యమో.. ఇంటి చుట్టూ, ఇంట్లో పెంచుకునే చెట్లకు కూడా వాస్తు నియమాలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. వాస్తు నియమాల ప్రకారం మొక్కలను పెంచితే, అలాంటి మొక్కలు ఎంపిక చేసుకుంటే అవి ఇంట్లో సానుకూల ఫలితాలనిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే కొన్ని రకాల చెట్లను ఇళ్లల్లో పెంచుకోరాదని సూచిస్తున్నారు. ఇళ్లలో పాలు కారే మొక్కలు, బోన్సాయ్ మొక్కలు, కాక్టస్, పత్తి మొక్కలు పెంచుకోవడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఇక ఇవే కాకుండా మరి కొన్ని వాస్తుకు అనుకూలంగా లేని మొక్కలు, చెట్లు పెంచడం వల్ల కుటుంబంలో భార్య భర్తల మధ్య కలహాలు, ఆర్థిక ఇబ్బందులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కాక్టస్ కాక్టస్ లేదంటే దాని సంబంధిత మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెంచరాదు..అలాంటి వాటితో వాస్తు రీత్యా మిమ్మల్రి దరిద్రం పట్టిపీడుస్తుంది. అయితే గులాబీ కూడా కాక్టస్ జాతికి చెందినదే. ఆ మొక్క తప్ప కాక్టస్ జాతికి చెందిన మొక్కల్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకండి.

చింత, గోరింటాకు చెట్లు చాలా మంది చింత, గోరింటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుతుంటారు. అయితే అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది. మీరు నివసించే ఇంటికి మరీ దగ్గర్లో అవి ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం ఉంది. గోరింటాకు మొక్కలు ఇంట్లో ఉండటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గోరింటాకు మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల ఆలోచనలు వస్తాయని, ఆ గృహస్తులు ప్రశాంతంగా జీవించ లేరని అంటున్నారు. కాబట్టి అలాంటి మొక్కలను ఇంటి ఆవరణలో కాకుండా ఇంటికి దూరంగా పెంచటం మంచిది. ఇంటి చుట్టూ చింతచెట్లు పెంచడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది.

ఇవి కూడా చదవండి

పత్తి చెట్టు.. కొందరు పూజకు పత్తి పనికొస్తుందనే ఉద్దేశంతో ఇంట్లోనే పత్తి మొక్కలను పెంచుకుంటుంటారు. అయితే వాటిని వీలైనంత వరకు పెంచుకోకుండా ఉండడమే మంచిది. పత్తి మొక్కలు ఇంట్లో ఉంటే పలు రకాల అనర్ధాలకు దారితీస్తుంది.

దుష్ట ప్రభావం కలిగించే చెట్లు ఉంటే ఇంట్లో సమస్యలు వస్తాయి. ఇంట్లో.. పాలు కారే చెట్లు, ముళ్ళు ఉన్న చెట్లు ఉండ కూడదు. రేగి జాతి చెట్లు, తుమ్మచెట్లను ఇంటి ఆవరణలో పెంచకూడదు. ఎందుకంటే ఇవి ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని పెంచుతాయి. ఫలితంగా కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతి పెరిగిపోయి గొడవలు, కోట్లాటలు మొదలవుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో