Hyderabad: ఈ నెల 11 నుంచి వేంకటేశ్వర వైభవోత్సవాలు.. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం..

అక్టోబ‌రు 11 నుంచి 15 వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్‌లో శ్రీ వేంక‌టేశ్వర వైభ‌వోత్సవాలు జరగనున్నాయి. ల‌క్షలాది మందికి శ్రీ‌వారి సేవ‌లు, ఉత్సవాలు ద‌ర్శించే అవ‌కాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. 10 రోజుల ముందు నుంచే...

Hyderabad: ఈ నెల 11 నుంచి వేంకటేశ్వర వైభవోత్సవాలు.. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం..
Hyderabad Ttd Temple
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 09, 2022 | 2:38 PM

అక్టోబ‌రు 11 నుంచి 15 వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్‌లో శ్రీ వేంక‌టేశ్వర వైభ‌వోత్సవాలు జరగనున్నాయి. ల‌క్షలాది మందికి శ్రీ‌వారి సేవ‌లు, ఉత్సవాలు ద‌ర్శించే అవ‌కాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. 10 రోజుల ముందు నుంచే విస్తృతంగా ప్రచారం చేయాలని జేఈవో వీర‌బ్రహ్మం అన్నారు. తిరుమ‌ల‌లో శ్రీ వేంక‌టేశ్వర‌ స్వామి వారికి జ‌రిగే నిత్య, వార‌ సేవ‌లు, ఉత్సవాల‌ను చూసే అవ‌కాశం ద‌క్కని ల‌క్షలాది మంది భ‌క్తులకు శ్రీ వేంక‌టేశ్వర వైభ‌వోత్సవాల ద్వారా వీటిని చూసి త‌రించే అదృష్టం ల‌భిస్తుంద‌ని జెఈవో శ్రీ వీర‌బ్రహ్మం చెప్పారు. ఇటీవ‌ల నెల్లూరులో నిర్వహించిన వైభ‌వోత్సవాల్లో వేలాది మంది భ‌క్తులు పాల్గొన్నార‌ని, అక్టోబ‌రు 11 నుంచి 15 వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్‌లోని ఎన్‌టీఆర్ స్టేడియంలో నిర్వహించే శ్రీ వేంక‌టేశ్వర వైభ‌వోత్సవాలు ల‌క్షలాది మంది భ‌క్తులు స్వామివారి సేవ‌లు చూసి త‌రించే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని చెప్పారు. వైభ‌వోత్సవాల గురించి హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో 10 రోజుల ముందునుంచే ప్రచార ర‌థాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వైభ‌వోత్సవాల ఏర్పాట్లపై సోమ‌వారం అధికారుల‌తో వ‌ర్చువ‌ల్‌గా స‌మీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ స్టేడియంలో భ‌క్తులు సులువుగా గుర్తించ‌గ‌లిగే ప్రాంతంలో టీటీడీ పంచ‌ గ‌వ్య ఉత్పత్తుల విక్రయ కౌంట‌ర్లు ఏర్పాటు చేయాల‌న్నారు. వేదిక‌తోపాటు స్టేడియంలో శోభాయ‌మానంగా పుష్పాలంక‌ర‌ణ‌, విద్యుత్ అలంక‌ర‌ణ‌లు, ఫ్లెక్సీలు, ఆర్చిల నిర్మాణం చేప‌ట్టాల‌ని ఆదేశించారు. భ‌క్తులు అధిక సంఖ్యలో వ‌చ్చే అవ‌కాశం ఉన్నందు వ‌ల్ల అవ‌స‌ర‌మైన‌న్ని ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాల‌న్నారు. పారిశుద్ధ్యం, అన్నప్రసాదాల పంపిణీ, ర‌వాణా, వ‌స‌తి, ఫొటో ఎగ్జిబిష‌న్ ఏర్పాటుపై ప్రత్యేక‌ శ్రద్ధ వ‌హించాల‌న్నారు. నెల్లూరు వైభవోత్సవాల‌ త‌ర‌హాలో పోటు, ప్రసాదం కౌంట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని కోరారు. భ‌క్తులు ఎండకు, వర్షానికి ఇబ్బంది ప‌డ‌కుండా జర్మన్ షెడ్డు ఏర్పాటు చేయాల‌న్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు త‌గినంత మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానించాల‌న్నారు. భ‌క్తుల‌కు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా స్టేడియంలో ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు.

ఆహ్వాన‌ ప‌త్రిక‌లు, భ‌క్తుల‌కు పాసులు అందించ‌డానికి త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని చెప్పారు. వేదిక మీద ఉండే సిబ్బంది, అధికారులు త‌ప్పని స‌రిగా టీటీడీ డ్రెస్‌ కోడ్ పాటించాల‌న్నారు. సేవ‌ల ప్రారంభానికి ముందు ప్రవ‌చ‌నాలు, ఆయా సేవ‌ల విశిష్టత‌ను భ‌క్తుల‌కు తెలియ‌జేసేందుకు ఇప్పటి నుంచే త‌గిన ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు. సంగీత‌, నృత్య కార్యక్రమాల ద్వారా స్వామివారి వైభ‌వాన్ని క‌ళ్లకు కట్టేలా ప్రద‌ర్శించే విధంగా క‌ళాకారుల‌ను ఎంపిక చేయాల‌ని సూచించారు. స్వామివారి సేవ‌ల‌ను అద్భుతంగా వివ‌రించ‌గ‌లిగే వ్యాఖ్యాత‌ల‌ను ఎంపిక చేసుకోవాల‌ని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు
నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు
ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్