Rajasthan: దొంగల బీభీత్సం.. వృద్ధురాలి కాళ్లు తెగ‌న‌రికి క‌డియాలు చోరీ.. రాజ‌స్థాన్‌లో దారుణం

స్థానికంగా నివసిస్తున్న ఓ వృద్ధురాలి కాళ్ల‌కు ఉన్న వెండి క‌డియాలపై దొంగ‌ల క‌న్నుప‌డింది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి ఆమె రెండు కాళ్ల‌ను న‌రికేసిన దొంగలు క‌డియాల‌ను ఎత్తుకెళ్లారు.

Rajasthan: దొంగల బీభీత్సం.. వృద్ధురాలి కాళ్లు తెగ‌న‌రికి క‌డియాలు చోరీ.. రాజ‌స్థాన్‌లో దారుణం
Rajasthan
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 09, 2022 | 2:12 PM

దొంగలు రెచ్చిపోతున్నారు.అడ్డొచ్చిన వారి ప్రాణాలు తీసి మరీ దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో దొంగలు తెగబడ్డారు. కాళ్ల క‌డియాల కోసం దుండగులు ఓ వృద్ధురాలి రెండు కాళ్లు తెగ న‌రికి లూటీకి పాల్పడ్డారు.జైపూర్‌లోని గాట్ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా నివసిస్తున్న ఓ వృద్ధురాలి కాళ్ల‌కు ఉన్న వెండి క‌డియాలపై దొంగ‌ల క‌న్నుప‌డింది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి ఆమె రెండు కాళ్ల‌ను న‌రికేసిన దొంగలు క‌డియాల‌ను ఎత్తుకెళ్లారు.

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో గుర్తుతెలియని దుండగులు ఓ వృద్ధురాలి కాళ్లను నరికేశారు. రాజస్థాన్ జ్యూయలరీ దోపిడీపై పోలీసులు వివరాలు వెల్లడించారు. 100 ఏళ్ల వృద్ధురాలి కాళ్లు నరికివేసి కాళ్ల కడియాలు దోచుకెళ్లారని గల్టా పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీపీ) తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న మహిళను ఇంటి సమీపంలోనే వదిలేసి నేరస్తులు పరారయ్యారు. మహిళ మెడపై గాయం గుర్తులు కూడా ఉన్నాయని.. నేరానికి ఉపయోగించిన ఆయుధంతో పాటు ఆమె కాళ్లకు తెగిన భాగాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దొంగ‌ల కోసం గాలింపు చేప‌ట్టిన‌ట్లు పేర్కొన్నారు. విష‌యం గురించి నా బిడ్డ‌ ఫోన్ చేసి చెప్పింద‌ని బాధితురాలి కుమార్తె గంగాదేవి విల‌పిస్తూ చెప్పింది.

ఇవి కూడా చదవండి

బాధితురాలి కుమార్తె గంగాదేవి బయటకు వెళ్లి వచ్చే లోపుగానే దొంగలు దారుణానికి పాల్పడ్డారని చెప్పింది. ఆమె పాదాల వద్ద తెగిపడిన భాగాలు చూసి ఆమె ఒక్కసారిగా షాక్‌ గురయ్యాయని చెప్పింది. తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం అందుకున్న వెంటనే స్థానికుల సాయంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.ఇరుగు పొరుగు వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దాంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ హృద‌య‌విధార‌క ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..