SSC CGL 2022: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సీజీఎల్‌ 2022 పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..

భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 20,000 పోస్టులను కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2022 ద్వారా భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 8తో ముగిసిన దరఖాస్తు..

SSC CGL 2022: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సీజీఎల్‌ 2022 పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..
SSC Constable GD 2022
Follow us

|

Updated on: Oct 09, 2022 | 2:58 PM

భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 20,000 పోస్టులను కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2022 ద్వారా భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 8తో ముగిసింది. ఐతే తాజాగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువును అక్టోబర్‌ 13వ తేదీ వరకు పొడిగిస్తూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అప్లై చేసుకోవడానికి మరో అవకాశం లభించింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా గ్రూప్ సీ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, గ్రూప్‌ బీ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష (టైర్‌-I, టైర్‌-II) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. టైర్‌ -I పరీక్ష డిసెంబర్‌ 2022లో నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.29,200ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
  • అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 2
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (MOR)
  • ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్
  • ఇన్‌స్పెక్టర్, (CGST & సెంట్రల్ ఎక్సైజ్)
  • ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
  • ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)
  • అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
  • సబ్ ఇన్‌స్పెక్టర్
  • ఇన్స్పెక్టర్ (డిపార్ట్మెంట్ పోస్ట్)
  • అసిస్టెంట్/సూపరింటెండెంట్
  • అసిస్టెంట్
  • రీసెర్చ్ అసిస్టెంట్
  • డివిజనల్ అకౌంటెంట్
  • సబ్ ఇన్‌స్పెక్టర్
  • జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
  • ఆడిటర్ (C & AG)
  • ఆడిటర్
  • ఆడిటర్ (CGDA)
  • అకౌంటెంట్
  • అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్
  • సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్కులు
  • ట్యాక్స్‌ అసిస్టెంట్
  • సబ్-ఇన్‌స్పెక్టర్

రాత పరీక్ష విధానం: టైర్‌ -1 పరీక్ష 200 మార్కులకు గానూ 100 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. గంటలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

ఇవి కూడా చదవండి
  • జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనీంగ్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు
  • జనరల్‌ అవేర్‌నెస్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు
  • క్వాంటిటేవిట్‌ ఆప్టిట్యూడ్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, కాంప్రహెన్షన్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..