AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘రాజు నేనేం పాపం చేశాను’ ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య! కంటతడి పెట్టిస్తున్న సెల్ఫీవీడియో

ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తనకు అన్యాయం జరిగిందంటూ బాధితురాలు పురుగుల మందు తాగుతూ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో బయటికి రావడంతో ఈ విషాద ఘటన బయటికి పొక్కింది..

Telangana: 'రాజు నేనేం పాపం చేశాను' ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య! కంటతడి పెట్టిస్తున్న సెల్ఫీవీడియో
Selfie Suicide in Telangana
Srilakshmi C
|

Updated on: Oct 07, 2022 | 8:45 PM

Share

ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తనకు అన్యాయం జరిగిందంటూ బాధితురాలు పురుగుల మందు తాగుతూ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో బయటికి రావడంతో ఈ విషాద ఘటన బయటికి పొక్కింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని షంషీర్ నగర్‌కు చెందిన తేజశ్రీ, నెన్నెల మండలం లంబాడితండాకు చెందిన ధరావత్ రాజ్ కుమార్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెను ఓ చోట ఉంచి కొంతకాలం సరదాగా గడిపాడు. పెళ్లి మాట వచ్చేసరికి రేపు..మాపు..అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకోవల్సిందేనని యువతి పట్టుపట్టడంతో రాజ్ కుమార్ ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న యువతి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనంతా చెప్పుకుంటూ.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆటోలో లంబాడితండాకు వెళ్తుండగా, మార్గమధ్యలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద యువతి స్పృహకోల్పోయింది.

దీంతో డ్రైవర్‌ ఆసుపత్రికి తరలించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. మెరుగైన వైద్యం కోసం యువతిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న (అక్టోబర్‌ 6) పరిస్థితి విషమించి యువతి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు తన చావుకు తాను ప్రేమించిన ధరావత్ రాజ్ కుమార్, అతని కుటుంబ సభ్యులని, రాజ్ కుమార్‌ను నమ్మి అందరినీ వదిలేసి వచ్చానని, ఇప్పుడు నాకు దిక్కెవరంటూ తేజశ్రీ ఆత్మహత్యకు పాల్పడే ముందు సెల్ఫీ వీడియో పేర్కొంది. హృదయవిదారకంగా ఉన్న ఈ వీడియోలోని యువతి మాటలు ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్నాయి. కూతురు చనిపోయిన విషయం తెలుసుకన్న యువతి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. కూతురి మృతికి కారణమైన రాజ్ కుమార్, అతని కుటుంబ సభ్యులను శిక్షించాలని మృతురాలి తల్లి సోయం లక్ష్మీ పోలీసులను అభ్యర్ధించింది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో.. రాజ్ కుమార్ తప్పించుకుని తిరుగుతుండటంతో మోసపోయానని యువతి గ్రహించింది. మనస్తాపంతో పురుగుల మందు సేవించి.. ఆటోలో లంబాడితండాకు వెళ్తుండగా, మార్గమధ్యలో స్పృహకోల్పోయింది. గమనించిన డ్రైవర్ తేజశ్రీని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా… చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. రాజ్ కుమార్ ను నమ్మి అందరినీ వదిలేసి వచ్చానని…ఇప్పుడు నాకు దిక్కెవరంటూ తేజశ్రీ ఆత్మహత్యకు పాల్పడే ముందు సెల్ఫీ వీడియో ద్వారా చెప్పిన మాటలు.. చూసిన వారిని కంటతడిపెట్టించాయి.

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి