UCO Bank Recruitment 2022: బ్యాంక్‌ జాబ్స్‌! డిగ్రీ అర్హతతో యూసీఓ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలివే..

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (యూసీఓ బ్యాంక్‌).. 10 సెక్యురిటీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

UCO Bank Recruitment 2022: బ్యాంక్‌ జాబ్స్‌! డిగ్రీ అర్హతతో యూసీఓ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలివే..
UCO Bank Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 13, 2022 | 2:31 PM

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (యూసీఓ బ్యాంక్‌).. 10 సెక్యురిటీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇండియన్‌ నేవీ/ఎయిర్ ఫోర్స్‌ లేదా పారామిలిటరీ ఫోర్సుల్లో అసిస్టెంట్‌ కమాండెంట్స్‌ లేదా డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోలీస్‌గా కనీసం 5 యేళ్లపాటు పని చేసిన అనుభవం ఉండాలి. లేదా పారామిలిటరీ ఫోర్సుల్లో ఇన్స్‌పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా కనీసం 8 యేళ్లు పనిచేసి ఉండాలి. రిజర్వేషన్‌ కేటగిరీలకు సడలింపు వర్తిస్తుంది. అభ్యర్ధుల వయసు జనవరి 1, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 19, 2022 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.500లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.36,000ల నుంచి రూ.63,840లు జీతంగా చెల్లాస్తారు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 19, 2022.
  • రాత పరీక్ష తేదీ: నవంబర్/డిసెంబర్‌ 2022.
  • ఇంటర్వ్యూ తేదీ: ఇంకా ప్రకటించలేదు.

రాత పరీక్ష విధానం.. మొత్తం 200 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 200ల మార్కులకు గానూ, 2 గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. పరీక్ష ఇంగ్లిస్‌ మద్యమంలో మాత్రమే నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి
  • ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 75 మార్కులు
  • జనరల్ అవేర్‌నెస్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు
  • ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు
  • కంప్యూటర్ నాలెడ్జ్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 25 మార్కులు

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.