Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికల ఎఫెక్ట్.. కేసీఆర్‌తో భేటీ అనంతరం ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన మాజీ ఎంపీ..

మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ వచ్చింది. నామినేషన్ల సందడి మొదలు కావడంతో కౌన్ బనేగా బై పోల్ బాహుబలి అన్న సౌండ్‌ తెలంగాణ అంతటా రీసౌండ్ చేస్తోంది.

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికల ఎఫెక్ట్.. కేసీఆర్‌తో భేటీ అనంతరం ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన మాజీ ఎంపీ..
Boora Narsaiah Goud
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 07, 2022 | 7:13 PM

మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ వచ్చింది. నామినేషన్ల సందడి మొదలు కావడంతో కౌన్ బనేగా బై పోల్ బాహుబలి అన్న సౌండ్‌ తెలంగాణ అంతటా రీసౌండ్ చేస్తోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఖరారు కావడంతో ఇక ప్రచారం సందడి మొదలుకాబోతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని అధికారికంగా ప్రకటించారు. అయితే, మునుగోడు టికెట్ ఆశించిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇవాళ గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఆయన కాసేపు మాట్లాడారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన బూర నర్సయ్య.. మునుగోడు అభివృద్ధి కోసం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్ ‌తోనే అని పేర్కొన్నారు.

కాగా, ఇదే సమయంలో మునుగోడు టికెట్ ఆశించినట్లు వచ్చిన కథనాలపై ప్రశ్నించగా.. ఆయన స్పందించారు. టికెట్ ఆశించడం తప్పు కాదన్నారు. ఇదే విషయంపై అధినేతతోనూ మాట్లాడినట్లు తెలిపారు. అయితే, తన అవసరం జాతీయ రాజకీయాల్లో ఎక్కువగా ఉంటుందని కేసీఆర్ అన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను పాటిస్తానని స్పష్టం చేశారు బూర నర్సయ్య. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించారు. టీఆర్ఎస్ గెలిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని, నియోజకవర్గ ప్రజలు ఆలోచించి కారు గుర్తుకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు మాజీ ఎంపీ.

అసంతృప్తుల రచ్చ..

కాగా, మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది మొదలు.. ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు, టికెట్ రెసులో స్ట్రాంగ్‌గా నిలిచారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. ఈ క్రమంలో నియోజకవర్గం పరిధిలోని అధికార పార్టీలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఒకానొక దశలో ఆశావహుల అసంతృప్తి పీక్స్‌కి చేరింది. మంత్రి జగదీష్ రెడ్డిపై బూర నర్సయ్య కామెంట్స్ చేయడం, మరోవైపు కర్నె ప్రభాకర్ సైతం ఉన్నత వర్గాలకే పదవులు అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం టీఆర్ఎస్‌లో విభేదాలను బహిర్గతం చేసింది. ఈ అసంతృప్తి నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత సైతం అభ్యర్థి ప్రకటనను దాటవేస్తూ వచ్చారు. అసంతృప్తితో ఉన్న నేతలతో మంతనాలు జరిపి.. పరిస్థితి చక్కబడేలా చేశారు. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..