AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reduce To Hiccups: ఎక్కిళ్లు ఎక్కువగా వస్తున్నాయా.. అయితే ఇలా ట్రై చేయండి

వీటికి కారణం ఛాతి అడుగున ఉండే డయాఫ్రమ్ అసంకల్పితంగా స్పందించినపుడు కలిగే శారీరక మార్పే ఎక్కిళ్ళు. ఇలా జరగటానికి చాలా కారణాలున్నాయి.

Reduce To Hiccups: ఎక్కిళ్లు ఎక్కువగా వస్తున్నాయా.. అయితే ఇలా ట్రై చేయండి
Hiccups
Jyothi Gadda
|

Updated on: Oct 09, 2022 | 12:45 PM

Share

కొందరు వ్యక్తులకు తినే సమయంలో లేదా ఆహారం తిన్న తర్వాత వేగంగా ఎక్కిళ్ళు రావడం మీరు తరచుగా చూసి ఉంటారు. చాలామందికి ఎక్కిళ్లు తరచుగా వస్తుంటాయి. వీటికి కారణం ఛాతి అడుగున ఉండే డయాఫ్రమ్ అసంకల్పితంగా స్పందించినపుడు కలిగే శారీరక మార్పే ఎక్కిళ్ళు. ఇలా జరగటానికి చాలా కారణాలున్నాయి. కానీ, ఎక్కళ్ల వల్ల కొన్ని సందర్బాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా మారుతుంది. ఈ పరిస్థితిని తట్టుకోవడం కష్టం అవుతుంది. అయితే, ఎక్కిళ్లు రాకుండా ఉండాలంటే ఎక్కిళ్లను ప్రేరేపించే విషయాలకు, తినుబండరాలకు దూరంగా ఉంటే చాలు. అయితే కొన్ని ఇంటి నివారణలు మీ ఈ సమస్యను అధిగమించగలవని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కిళ్లను తొలగించడంలో నిమ్మకాయ, చక్కెర మీకు గొప్పగా సహాయపడుతాయి. మీరు నిమ్మరసంలో చక్కెర కలిపి తీసుకుంటే, ఎక్కిళ్ళ సమస్య వెంటనే తొలగిపోతుందని చెబుతున్నారు. నీళ్లు ఎక్కువగా త్రాగడం వల్ల కూడా సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఎక్కిళ్ళు వచ్చినట్లయితే నేలపై కూర్చుని మోకాళ్లను ఛాతీకి అతుక్కోవాలి. 5 నిమిషాల తర్వాత మీ ఎక్కిళ్ళు పోయినట్లు మీకు అనిపిస్తుంది.

మీకు ఎక్కిళ్ళు ఉంటే మీ దృష్టిని దాన్నుంచి మీ దృష్టిని మళ్లించటం మంచిది.. కొన్నిసార్లు ఎక్కిళ్ల సమస్యను దృష్టిని మరల్చడం ద్వారా కూడా అధిగమించవచ్చు.తేనెను తీసుకోవడం ద్వారా కూడా ఎక్కిళ్ల సమస్యను అధిగమించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి