Milk: పాల ఉత్పత్తులు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా?.. ఇందులో నిజం ఏంటో తెలుసు..
మీరు అధిక కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతుంటే.. కొన్ని పాల ఉత్పత్తులు చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయని ప్రచారంలో ఉంది. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలుసుకుందాం..
పాల ఉత్పత్తులను తీసుకోవడం మన ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందా..? ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుందా..? మరి చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేసుకోవాలంటే పాల ఉత్పత్తులను పూర్తిగా మానేయాల్సిందేనా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. నిపుణల అభిప్రాయం ప్రకారం, ఇంత ఆందోళన అస్సలు అవసరం లేదు. సాధారణంగా, మీరు పాల ఉత్పత్తులను తీసుకుంటే.. అది మీ కొలెస్ట్రాల్‌పై చెడు ప్రభావం చూపదు. కానీ, అధికంగా ఏది తీసుకున్నా అది చెడు చేస్తుంది. పాల ఉత్పత్తుల విషయంలో కూడా అదే జరుగుతుంది. మీరు ఈ ఉత్పత్తులను అధికంగా ఉపయోగిస్తే.. అవి మీకు ప్రయోజనకరమైనవి కాకుండా హానికరం మారుతాయి. మీ శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. పాల ఉత్పత్తులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎందుకు పెంచగలవో మనం ఈ రోజు తెలుసుకుందాం..
పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా?
చెడు కొలెస్ట్రాల్ గురించి మనం తరచుగా వినే ఉంటాం కానీ ఇది ఇలా వస్తుంది.. ఇందులో నిజం ఏంటో తెలుసుకునేందుకు చాలా పరిశోధనలు జరిగాయి. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉన్నాయి. హెల్త్‌లైన్ నివేదిక అనుసారం.. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు ఎల్డీఎల్, ఇతర అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు హెచ్‌డీఎల్ అని అంటారు. ఈ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను “మంచి” కొలెస్ట్రాల్‌గా పరిగణిస్తారు. అయితే ఎల్‌డీఎల్‌ను చెడు కొలెస్ట్రాల్‌గా పరిగణించబడుతుంది. రక్తంలో ఎల్‌డిఎల్ పరిమాణం పెరిగినప్పుడు అది మన ధమనులను దెబ్బతీస్తుంది.
సాధారణంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి 200 Mg/డీఎల్ కంటే తక్కువగా ఉండాలి. 200, 239 Mg/డీఎల్ మధ్య కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా పరిగణించబడుతుంది. అది 240 లేదా అంతకంటే ఎక్కువ Mg/DLకి పెరిగినప్పుడు అది అధిక కొలెస్ట్రాల్‌గా పరిగణించబడుతుంది. తరచుగా, కొలెస్ట్రాల్ స్థాయిలు, మొత్తం కొలెస్ట్రాల్‌ను కొలవడానికి లిపోప్రొటీన్ ప్రొఫైల్ అని పిలువబడే పరీక్షను చేస్తారు. ఇది హెచ్‌డీఎల్,ఎల్‌డీఎల్,వీఎల్‌డీఎల్ మిశ్రమం మొత్తాన్ని చూపుతుంది.
పాల ఉత్పత్తులు మన శరీరాన్ని బలపరుస్తున్నప్పటికీ.. కొలెస్ట్రాల్ గురించి మనం తెలుసుకోవలసిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. కొవ్వు అధికంగా ఉండే పాల ఉత్పత్తులు మీకు హానికరంగా మారొచ్చు. ఇటువంటి ఆహారాలు మీ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఇది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీరు పాల ఉత్పత్తులను క్రమం తప్పకుండా తినాలి .. తాగాలని అనుకుంటే.. తక్కువ కొవ్వు ఉత్పత్తులను ఎంచుకోండి. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు మీ ఆరోగ్యానికి మంచివి, శరీరంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలను కలిగించవు లేదా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచవు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం