AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neck Pain: ఇలా చేస్తే మెడ నొప్పి5 నిమిషాల్లో నయం చేయవచ్చు.. ఈ హోం రెమెడీస్ మీకోసం

మెడనొప్పి అనేది ఒక సాధారణ సమస్య. కానీ అది ఇతర తీవ్రమైన కారణాల వల్ల వచ్చినట్లయితే.. మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

Neck Pain: ఇలా చేస్తే మెడ నొప్పి5 నిమిషాల్లో నయం చేయవచ్చు.. ఈ  హోం రెమెడీస్  మీకోసం
Neck Pain
Sanjay Kasula
|

Updated on: Oct 09, 2022 | 1:43 PM

Share

మెడ నొప్పి అనేది చాలా మందిని ప్రభావితం చేసే సాధారణ సమస్య. రోజంతా సరిగ్గా కూర్చోకపోవడం లేదా మనం కూర్చునే తీరు లేదా ఆఫీసులో కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు కూర్చునే తీరు, ల్యాప్‌టాప్ ఉపయోగించే తీరు వల్ల మెడపై ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇది మెడ కండరాలలో టెన్షన్, నొప్పిని కలిగిస్తుంది. కొన్నిసార్లు ఈ మెడ నొప్పికి ప్రధాన కారణం ఆస్టియో ఆర్థరైటిస్ కూడా కావచ్చు. మెడ నొప్పి సాధారణంగా దానంతటదే మెరుగవుతుంది, కానీ నొప్పి చాలా కాలం పాటు కొనసాగితే, అది రోజువారీ జీవితంలో పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. మెడనొప్పి అనేది చాలా సాధారణమైన సమస్య కానీ మీరు మరేదైనా ఇతర కారణాలతో బాధపడుతుంటే, మీరు వైద్యుడిని సంప్రదించాలి. మెడ నొప్పి తరచుగా కండరాల ఒత్తిడి, కీళ్ల నొప్పులు, నరాల నొప్పి, గాయం లేదా ఆర్థరైటిస్ వల్ల కూడా సంభవించవచ్చు.

మెడ నొప్పికి మందు ఏంటి?

ఈ మెడ నొప్పికి ఖచ్చితమైన చికిత్స ఏదైనా ఉందా అని ఇప్పుడు మీ మదిలో ఈ ప్రశ్న వస్తోంది. అయితే నిపుణులు మెడ నొప్పిని తగ్గించడానికి లేదా ఉపశమనం కల్పించేదుకు సరైన సీటింగ్ పొజిషన్‌ ఉండాలని.. కూర్చునే భంగిమలో మార్పులను సూచిస్తుంటారు. అంతేకాదు పని సమయంలో తరచుగా విరామం తీసుకోవాలని అంటారు. డెస్క్, కుర్చీ లేదా కంప్యూటర్‌ను సరిగ్గా ఉంచుకోవాలని సూచిస్తారు. ఇలా చేయడం వల్ల మెడపై ఎలాంటి ప్రభావం ఉండదని సలహా ఇస్తారు. అలాగే, అధిక బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. ఇది కాకుండా, మీరు ఉపశమనం పొందగల మరికొన్ని పద్ధతులు మనం ఇక్కడ తెలుసుకుందాం..

టెన్నిస్ బాల్ మసాజ్

రీసెర్చ్‌గేట్‌లో ప్రచురించబడిన నివేదికలో ఒక గొప్ప పరిష్కారం సూచించబడింది. టెన్నిస్ బాల్ తీసుకొని మీ మెడకు వివిధ మార్గాల్లో మసాజ్ చేయడం మొదలు పెట్టండి. నొప్పి ఉన్న ప్రదేశాన్ని 20-30 సెకన్ల పాటు నొక్కి, ఆపై వదలిపెట్టండి. మళ్లీ మసాజ్ చేయడం ప్రారంభించండి. టెన్నిస్ బాల్ మీ మృదు కణజాలాలను సడలిస్తుంది. కండరాలను ఫ్రీగా మార్చుతుంది. దీనివల్ల కొంతవరకు నొప్పి తగ్గి ఉపశమనం లభిస్తుంది.

ధనురాసనం చేయండి..

ధనుస్ అంటే సంస్కృతంలో విల్లు. శరీరాన్ని విల్లులా వంచి చేసే ఆసనం ధనురాసనం. ఒక క్రమ పద్ధతిలో శరీరాన్ని వెనుకకు వంచి పాదాలను చేతుల్తో పట్టుకుని ఈ ఆసనాన్ని చేయాలి. ఇది చేయాలంటే ముందుగా చదునైన ప్రదేశంలో చాప కాని అలాంటి వేరేదైనా కానీ నేలపై పరచి దానిపై మెత్తటి దుప్పటి లాంటిది వేసి ఆసనాన్ని చేయాలి. ​​నేలపై వెల్లకిల పడుకోండి. మీ అరచేతులు మీ తుంటికి చేరుకునేలా మీ మోకాళ్లను లోపలికి తీసుకోండి. రెండు చేతులతో మీ పాదాలను పట్టుకోండి. గాలిని పీల్చేటప్పుడు, అరచేతులను నేరుగా పైకి తీసుకురండి. నేల నుంచి తొడలను ఎత్తండి. మీ పైభాగాన్ని పైకి లాగండి. అదే సమయంలో నేల నుంచి ఎత్తండి. 10 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండండి. శ్వాస వదులుతూ, నెమ్మదిగా మీ శరీరాన్ని నేలపైకి తీసుకురండి. భుజాలను నిఠారుగా ఉంచడానికి.. వెనుక కండరాలను బలోపేతం చేయడానికి విల్లుగా ఈ భంగిమ ఉపయోగపడుతుంది.

మెడ చాచు..

మెడ ముందు భాగాన్ని సాగదీయడానికి నెమ్మదిగా గడ్డాన్ని ఛాతీ నుంచి క్రిందికి తీసుకుని.. 15 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండండి. అప్పుడు మీ తలను తిరిగి ఎదా స్థానానికి తీసుకురండి. దీని తర్వాత తలను వెనుకకు వంచి, 15 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండండి. రెండు స్థానాల్లో వ్యాయామం 10 సార్లు పునరావృతం చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం