AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Simple method: ఉడకబెట్టిన గుడ్డు పొట్టు తీయటం ఇంత ఈజీనా..? ఇన్‌స్టాగ్రామ్‌లో వైరలవుతున్న వీడియో

వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.. ఈ వీడియో కింద చాలా మంది కామెంట్స్ చేశారు. గుడ్లు పగులగొట్టడానికి ఇంత సులభమైన మార్గం చూపించిన తనకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Simple method: ఉడకబెట్టిన గుడ్డు పొట్టు తీయటం ఇంత ఈజీనా..? ఇన్‌స్టాగ్రామ్‌లో వైరలవుతున్న వీడియో
Boiled Egg
Jyothi Gadda
|

Updated on: Oct 09, 2022 | 11:17 AM

Share

గుడ్డు అనేది పోషకాల నిలయం. చాలా మందికి కోడి గుడ్లంటే చాలా ఇష్టం.. పొద్దున్నే ఉడకబెట్టిన గుడ్లను తింటుంటారు. ఇక కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు గుడ్లను ఎక్కువగా లాగించేస్తున్నారు. శక్తి రావాలని, బాడీకి తగినంత ప్రోటీన్ అందాలని అందరూ ఆరాటపడుతున్నారు. అయితే కోడి గుడ్డు ఉడక పెట్టడానికి ఎంత సమయం పడుతుందో కొందరికి దాని పొట్టు తీయడం కూడా అంతే సమయం పడుతుంది. కొన్నిసార్లు షెల్ పగలగొట్టేటప్పుడు గుడ్డులోని తెల్లసొన కూడా దానితోటు వచ్చేస్తుంది. అందుకే గుడ్లు ఉడికిన వెంటనే చల్లటి నీటిలో వేస్తారు. ఇలా చేయడం వల్ల గుడ్డును సులభంగా తొలగించుకోవచ్చు. కానీ, ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఉడగకబెట్టిన గుడ్డు పొట్టును చిటికెలో తీసేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు గుడ్డు పొట్టు తీయటం ఇంత ఈజీనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. సింపుల్ ట్రిక్‌తో అతడు ఈ పొట్టును రెండు మూడు సెకన్ల సమయంలోనే తీసేశాడు.

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ గుడ్లు పగలగొట్టడానికి సులభమైన మార్గంతో ముందుకు వచ్చారు. ఇంతకంటే సులువుగా ఏముంటాయని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈ వీడియోను సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన మ్యాక్స్ షేర్ చేశారు. ఫిబ్రవరిలో ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మ్యాక్స్ వీడియో విడుదలైన మరుసటి రోజు, యూట్యూబ్ దానిని తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. అది మళ్లీ వైరల్ కావడం ప్రారంభించింది. ఉడకబెట్టిన గుడ్డును తన చేతిలోకి తీసుకున్న తర్వాత మాక్స్ దాని పైభాగంలో దిగువన రెండు చిన్న రంధ్రాలు చేసాడు. గుడ్డు పెంకును పగలగొట్టడం ద్వారా ఈ రంధ్రం ఏర్పడుతుంది. దీని తర్వాత ఏం జరిగిందనేది చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. రెండు వైపులా రంధ్రం చేసిన తరువాత, అతను ఒక వైపు నుండి మరొక వైపుకు అతను గుడ్డుపై బలంగా ఊదడం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Max Klymenko (@maxoklymenko)

వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఈ వీడియో కింద చాలా మంది కామెంట్స్ చేశారు. గుడ్లు పగులగొట్టడానికి ఇంత సులభమైన మార్గం చూపించిన తనకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే ఇలా చేయడం వల్ల క్లీన్ అవుతుందా అనే సందేహం చాలా మందికి ఉంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..