- Telugu News Photo Gallery Cricket photos Top 5 youngest players will play t20 world cup 2022 arshdeep singh ayan khan check here full list
T20 World Cup 2022: తక్కువ ఏజ్‌లో టీ20 ప్రపంచ కప్ ఆడనున్న ఆటగాళ్లు వీరే.. లిస్టులో టీమిండియా ప్లేయర్ కూడా..
T20 World cup Youngest Players: T20 ప్రపంచ కప్ 2022 ప్రారంభానికి మరో 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈసారి ఈ టోర్నీలో చాలా మంది యువ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. వారిలో టాప్ 5 లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..
Updated on: Oct 11, 2022 | 3:34 PM

T20 ప్రపంచ కప్ 2022 అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో సూపర్-12 మ్యాచ్‌లు అక్టోబర్ 22 నుంచి జరగనున్నాయి. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో ఆడనుంది. బౌలింగ్ పరంగా ఈసారి టీమిండియా కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు బౌలింగ్ బాధ్యతను యువ బౌలర్లు మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. టీమిండియా మాత్రమే కాదు.. యువ ఆటగాళ్లతో అన్ని జట్లూ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ఈసారి T20 ప్రపంచ కప్‌లో యువ ఆటగాళ్ల సందడి ఎక్కువగా కనిపిస్తుండడంతో.. టాప్ 5 జాబితాలో ఉన్న తక్కువ వయసు గల యువ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

1. అయాన్ ఖాన్ (యూఏఈ, 16 సంవత్సరాలు).. UAE తరపున ఆడుతున్న 16 ఏళ్ల అయాన్ ఖాన్ ఈసారి T20 ప్రపంచ కప్ 2022లో ఆడనున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. అయాన్ తక్కువ వయసులోనే T20 ప్రపంచ కప్ ఆడబోతున్నాడు. మాములుగా అయితే, చాలామంది ఆ వయస్సులోనే క్రికెట్ ఆడడం ప్రారంభిస్తారు. అయాన్ ఇప్పటివరకు UAE తరపున మొత్తం 2 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అందులో అతను 147.05 స్ట్రైక్ రేట్‌తో 25 పరుగులు చేశాడు.

2. నసీమ్ షా (పాకిస్తాన్, 19 సంవత్సరాలు).. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా వయసు 19 ఏళ్లే అయినా.. అతడి వేగం చూస్తే మాత్రం అలా అనిపించదు. ఇటీవల ఆడిన ఆసియా కప్ 2022లో అతను భారత్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లో తన T20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అరంగేట్రం మ్యాచ్ నుంచే నసీమ్ టీ20 ఇంటర్నేషనల్‌లో తనదైన ముద్ర వేశాడు. పాకిస్థాన్ తరపున నసీమ్ ఇప్పటివరకు మొత్తం 13 టెస్టు మ్యాచ్‌లు, 3 వన్డేలు, 6 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు.

3. మహ్మద్ సలీం (ఆఫ్ఘనిస్తాన్, 20 సంవత్సరాలు).. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మహ్మద్ సలీమ్ జాతీయ ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఇంకా అరంగేట్రం చేయలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ ఫాస్ట్ బౌలర్ నిలకడగా రాణిస్తున్నాడు. సలీం ఇప్పటి వరకు మొత్తం 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 27.51 సగటుతో 41 వికెట్లు పడగొట్టాడు. 2022లో ఆడిన షాపెజా లీగ్‌లో, అతను కేవలం 6.63 ఎకానమీతో 9 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు.

4. ట్రిస్టన్ స్టబ్స్ (దక్షిణాఫ్రికా 22 సంవత్సరాలు).. 2 ఏళ్ల ట్రిస్టన్ స్టబ్స్ ప్రస్తుతం ఓ సంచలనంగా మారాడు. ట్రిస్టన్ అత్యధిక స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం తెలిసిందే. అతను ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరపున మొత్తం 9 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అందులో అతను 191.98 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 142 పరుగులు చేశాడు.

5. అర్ష్‌దీప్ సింగ్ (23 సంవత్సరాలు).. 2022 సంవత్సరంలోనే భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్.. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు భారత జట్టుకు మంచి ప్రదర్శన ఇస్తూ వస్తున్నాడు. కొత్త బంతితో స్వింగ్ చేయడంతోపాటు పాత బంతితో కచ్చితమైన యార్కర్లు వేయగల సత్తా అర్ష్‌దీప్ సింగ్‌కు ఉంది. అర్ష్‌దీప్ ఇప్పటివరకు టీమ్ ఇండియా తరపున మొత్తం 13 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. అందులో 19.78 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు.




