ఆటో డ్రైవర్ కు UPI ద్వారా.. రూ.15,682 పంపిన ప్రయాణికుడు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్!
బెంగళూరులో ఓ స్టార్టప్ సీఈఓ ఆటో ఛార్జీ రూ.156కు బదులుగా పొరపాటున రూ.15,682ను యూపీఐ ద్వారా పంపించాడు. అయితే ఆటో డ్రైవర్ వెంటనే ఆ విషయం గుర్తించి మొత్తం డబ్బును తిరిగి ఇచ్చేశాడు. అదనంగా బహుమతిగా ఇచ్చిన డబ్బును కూడా తిరస్కరించాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నిజాయితీకి నిదర్శనంగా నిలిచింది.
ఆన్‌లైన్ చెల్లింపులు పెరిగాక తప్పుడు ఖాతాలకు డబ్బులు బదిలీ కావడం సాధారణంగా మారింది. అలా పోయిన సొమ్ము తిరిగి వస్తుందన్న ఆశలు కూడా ఎవరికీ ఉండవు. కానీ ఓ ప్రయాణికుడు పొరపాటున తన ఆటో ఛార్జీకి బదులుగా ఏకంగా రూ. 15,682 మొత్తాన్ని ఆటో డ్రైవర్ యూపీఐ ఖాతాకు పంపాడు. హింగ్లీష్ అనే స్టార్టప్‌ను నడుపుతున్న సీఈఓ శుభమ్ గునె బెంగళూరులోనే ఉంటున్నాడు. అయితే ఈయన ఇటీవలే తన పని నిమిత్తం ఓ ఆటోలో ప్రయాణించాడు. ఆయన తన గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ఆటో అతడు రూ.156 అయిందని చెప్పాడు. వెంటనే శుభమ్ ఆ డబ్బును డిజిటల్ పద్ధతిలో చెల్లించడానికి ప్రయత్నించాడు. మొబైల్ యాప్‌లో నంబర్లు టైప్ చేసే క్రమంలో పొరపాటు జరిగి.. రూ.156కు బదులుగా రూ.15,682 పంపాడు. ఆపై శుభమ్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ ఆటో డ్రైవర్ మాత్రం తనకు వచ్చిన డబ్బులు ఎన్నో చూసుకుని షాక్ అయ్యాడు. వెంటనే తన ముందు వెళ్తున్న సీఈఓ వద్దకు పరుగులు పెట్టాడు. సార్ మీరు నాకు రూ.156 కు బదులుగా రూ.15, 682 పంపారని చెప్పాడు. అప్పుడే శుభమ్ తన ఫోన్ చూశాడు. అప్పుడే అతడికి తాను ఎన్ని డబ్బులు పంపాడో అర్థమైంది.అయితే ఆటో డ్రైవర్ వెంటనే మీ డబ్బులు మీకు పంపిస్తున్నాని చెబుతూ ఆ మొత్తాన్ని పంపించాడు. నేను మీకు ఇవ్వాల్సిన రూ.156 అయినా తీసుకోమని శుభమ్ చెప్పగా.. వద్దని వెళ్లిపోబోయాడు. అప్పుడే శుభమ్ మరో రూ.500లను అతడికి ఫోన్ పే చేశాడు. కానీ మళ్లీ ఆటో అతడు ఆ డబ్బును తిరిగిచ్చేశాడు. నాకు డబ్బులు ఏమీ వద్దు.. నేను మీ డబ్బులను మీకే పంపానని చెప్పాడు. ఇదంతా విన్న శుభమ్‌కు మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని అనిపించింది. తన అనుభవాన్ని శుభమ్ ‘లింక్డ్‌ఇన్’లో పోస్ట్ చేశాడు. ఆటో డ్రైవర్ నిజాయితీని, విలువలను ప్రశంసించాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలోకి వచ్చిన కొద్దిసేపట్లోనే వేలాది మంది నెటిజన్లను ఆకర్షించింది. నిత్య జీవితంలో ఇలాంటి నిజాయితీని చూడటం చాలా అరుదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. జేసీబీతో వచ్చి.. ఇంటిని కూల్చేసిన భర్త
ఐఫోన్ కావాలన్న ప్రియురాలు.. మైనర్ ఏం చోరీ చేసాడంటే..
ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త
ఐఫోన్ కావాలన్న ప్రియురాలు.. మైనర్ ఏం చోరీ చేసాడంటే..
ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!
బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!
పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ
అమ్మా.. ఇదిగో నా మొదటి జీతం.. తల్లిదండ్రుల రియాక్షన్ ఇదే!

