AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ

పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ

Phani CH
|

Updated on: Jun 09, 2026 | 3:38 PM

Share

ప్రకాశం జిల్లా అద్దంకిలో యజమాని కళ్లెదుటే ఎలక్ట్రిక్ స్కూటీ చోరీకి గురైన ఘటన సంచలనంగా మారింది. పేపర్ చదవడంలో మునిగిపోయిన యజమాని స్కూటీకి తాళం తీయడం మరిచిపోగా, దొంగ క్షణాల్లో బండిని స్టార్ట్ చేసి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాహనాలకు తాళం వేయడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా దొంగలు కూడా అప్‌డేట్‌ అవుతున్నారు. ఎలాంటి ప్రదేశంలోనైనా రెప్పపాటులో తమ టార్గెట్‌ను కంప్లీట్‌ చేసేస్తున్నారు. ఇటీవల కాలంలో బైకు చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాళం వేయకుండా బండిని వదిలేస్తే దొంగలు ఎంత స్పీడ్‌గా పని కానిచ్చేస్తారో చెప్పడానికి ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఈ ఘటనే ఒక ఉదాహరణ. యజమాని కళ్లెదుటే, ఆయన పేపర్ చదువుకుంటుండగానే ఒక కేటుగాడు ఎలక్ట్రిక్‌ స్కూటీని దొంగిలించిన తీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అద్దంకి పట్టణానికి చెందిన చేబ్రోలు వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి తన ఎలక్ట్రికల్ స్కూటీపై బంగ్లా రోడ్డు సెంటర్‌కు వచ్చాడు. అక్కడ ఒక షాపు ముందు బండి ఆపిన ఆయన.. తాళం తీయడం మరిచిపోయాడు. అంతేకాదు, ఆ స్కూటీకి ఎదురుగానే ఉన్న షాపు మెట్లపైన కూర్చుని హాయిగా పేపర్‌ చదువుకుంటున్నాడు. అదే సమయంలో అక్కడ పొంచి ఉన్న ఒక దొంగ, స్కూటీకి తాళం కీ-హోల్‌లోనే ఉండటాన్ని గమనించాడు. యజమాని పేపర్ చదవడంలో పూర్తిగా లీనమైపోవడాన్ని చూసి.. మెల్లగా స్కూటీ ఎక్కి, స్టార్ట్ చేసి రెప్పపాటులో అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. కాసేపటి తర్వాత పేపర్ చదవడం పూర్తయ్యాక తలెత్తి చూసిన వెంకట సుబ్బయ్యకు అక్కడ బండి కనిపించకపోవడంతో తీవ్ర షాక్‌కు గురయ్యాడు. తన కళ్ల ముందే స్కూటీ చోరీకి గురైందని ఆలస్యంగా గ్రహించి, చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ విచిత్ర దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బండికి తాళం పెట్టడం మర్చిపోతే.. దొంగలు ఇలా కళ్ల ముందే నమస్కారం పెట్టేసి వెళ్తారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మా.. ఇదిగో నా మొదటి జీతం.. తల్లిదండ్రుల రియాక్షన్‌ ఇదే!

మనుషుల పై ఏఐ తిరగబడనుందా? అచ్చం రోబో సినిమాలో చూపినట్లుగా…!

వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది

Jagapathi Babu: పాపం! జాన్వీని తిట్టొద్దు..ఆమె దర్శకుడు చెప్పిందే చేసింది

Jagapathi Babu: ‘పరభాషా నటులతో పోల్చితే అనుకున్నంత గుర్తింపు రావడం లేదు

Follow Us