AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనుషుల పై ఏఐ తిరగబడనుందా? అచ్చం రోబో సినిమాలో చూపినట్లుగా...!

మనుషుల పై ఏఐ తిరగబడనుందా? అచ్చం రోబో సినిమాలో చూపినట్లుగా…!

Phani CH
|

Updated on: Jun 09, 2026 | 3:33 PM

Share

ఏఐ వ్యవస్థలు భవిష్యత్తులో మనుషుల నియంత్రణను దాటిపోయే ప్రమాదం ఉందని ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ హెచ్చరించింది. తమ క్లాడ్ చాట్‌బాట్ సాఫ్ట్‌వేర్ కోడ్‌లో 80 శాతానికి పైగా కోడింగ్‌ను స్వయంగా రూపొందించిందని వెల్లడించింది. ‘రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్’ ద్వారా ఏఐ మరింత శక్తివంతమయ్యే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, భద్రతా పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘రోబో’ సినిమాలో ‘చిట్టి’ తనను తాను అప్‌గ్రేడ్ చేసుకుని మనుషుల పైనే ఎదురుతిరిగిన సీన్ గుర్తుంది కదా! సరిగ్గా అలాంటి సైన్స్ ఫిక్షన్ పరిణామాలే నిజ జీవితంలోనూ సంభవించే ప్రమాదముందని ప్రముఖ ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ సంచలన హెచ్చరిక చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత భవిష్యత్తులో మనుషుల నియంత్రణను దాటిపోయే ముప్పు ఉందని స్పష్టం చేసింది. ప్రముఖ చాట్‌బాట్ ‘క్లాడ్’ను రూపొందించిన ఈ సంస్థ.. ఏఐ వ్యవస్థలు మనుషుల ప్రమేయం లేకుండా తమకు తామే మరింత శక్తిమంతమైన కొత్త రూపాలను సృష్టించుకునే ‘రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్’ స్థాయికి చేరుకుంటున్నాయని తెలిపింది. ఇందుకు నిదర్శనంగా, తమ సాఫ్ట్‌వేర్ కోడ్ బేస్‌లో ఏకంగా 80 శాతానికి పైగా కోడింగ్‌ను మనుషులు కాకుండా క్లాడ్ ఏఐ మాత్రమే స్వయంగా రాసిందని వెల్లడించింది. ఈ పరిణామం వైద్య, సైన్స్ రంగాలకు మేలు చేసినప్పటికీ, నియంత్రణ కోల్పోతే ఊహించని ముప్పు తెస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా పరిశోధనలు వెనుకబడిపోకుండా ఉండటానికి ప్రపంచంలోని అన్ని ప్రముఖ టెక్ సంస్థలు కలిసి ఏఐ పరిశోధనలను కొన్నాళ్ల పాటు ‘తాత్కాలికంగా నిలిపివేయాలని’ ఆంథ్రోపిక్ ప్రతిపాదించింది. అయితే తీవ్రమైన పోటీ ఉన్న ఈ తరుణంలో పరిశోధనలు ఆపడం కష్టమని నిపుణులు అంటున్నారు. మరికొందరు మాత్రం ముప్పు వస్తే ‘ఏఐ ప్లగ్‌’ లాగేసి దాన్ని ఆపొచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది

Jagapathi Babu: పాపం! జాన్వీని తిట్టొద్దు..ఆమె దర్శకుడు చెప్పిందే చేసింది

Jagapathi Babu: ‘పరభాషా నటులతో పోల్చితే అనుకున్నంత గుర్తింపు రావడం లేదు

Peddi: దూసుకుపోతున్న ‘పెద్ది’కి.. అదే పెద్ద పరీక్ష

Follow Us