Jagapathi Babu: పాపం! జాన్వీని తిట్టొద్దు..ఆమె దర్శకుడు చెప్పిందే చేసింది
రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు జగపతిబాబు ఆమెకు మద్దతుగా నిలిచారు. దర్శకుడు చెప్పినట్లే నటీనటులు పనిచేస్తారని, ఒక పాత్ర నచ్చలేదని వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ‘పెద్ది’. జూన్ 4న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.292 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి థియేటర్లలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇందులో అప్పలసూరి పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. కానీ ఈ మూవీ విడుదలయ్యాక ఆమె పాత్రపై నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. కేవలం గ్లామరస్ సీన్లు మాత్రమే ఉన్నాయని.. పాత్రకు ప్రాధాన్యత లేదని విమర్శిస్తున్నారు. జాన్వీని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్యూలో జాన్వీపై ట్రోల్ చేయడాన్ని జగపతి తప్పుబట్టారు. ఆమెకు మద్దతుగా మాట్లాడాడు. సినిమా విషయాల్లో నటీనటులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయవద్దని నెటిజన్లకు జగపతి సూచించాడు.’పాపం ఆ అమ్మాయి ఏం చేసింది? డైరెక్టర్ చెప్పిందే కదా చేసింది. ఆర్టిస్టుగా ఒక డైరెక్టర్ మాట వినాలి. మేం అందరం డైరెక్టర్ చెప్పింది చేస్తాం. ఆ అమ్మాయి కూడా దర్శకుడు ఏం చెబితే అది చేసింది.’ అని జగపతి చెప్పుకొచ్చాడు. కొన్నిసార్లు మనం అనుకున్నది స్క్రీన్‌పై మిస్‌ఫైర్ కావచ్చని.. అంతమాత్రానికే ఒక వ్యక్తిని మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని జగపతి అన్నాడు. ఈ విషయంలో తాను జాన్వీకపూర్‌కు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నానంటూ తన సపోర్ట్‌ను తెలియజేశాడు జగపతిబాబు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jagapathi Babu: ‘పరభాషా నటులతో పోల్చితే అనుకున్నంత గుర్తింపు రావడం లేదు
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
కారు ముక్కలైనా సేఫ్‌గా బయటపడ్డ నలుగురు
కన్నవారిని గెంటేసిన కొడుకు.. చివరిలో సూపర్ ట్విస్ట్
కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె!
కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. అందరికీ జీరో బిల్లులే
బైక్ ట్యాక్సీ రైడర్‌గా.. ఓటమి భయం నుంచి బయటపడ్డాడు!
రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా

