AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మా.. ఇదిగో నా మొదటి జీతం.. తల్లిదండ్రుల రియాక్షన్‌ ఇదే!

అమ్మా.. ఇదిగో నా మొదటి జీతం.. తల్లిదండ్రుల రియాక్షన్‌ ఇదే!

Phani CH
|

Updated on: Jun 09, 2026 | 3:35 PM

Share

ఐఐఎం పూర్తి చేసిన అశ్వజీత్ కాంబ్లే తన మొదటి జీతాన్ని పూర్తిగా నగదు రూపంలో తీసి తల్లిదండ్రుల చేతుల్లో పెట్టి అందరినీ భావోద్వేగానికి గురిచేశాడు. కుటుంబం చేసిన త్యాగాలకు గుర్తుగా ఈ కానుక అందించానని తెలిపాడు. అన్నయ్య ఐఎఫ్ఎస్ అధికారి కావడం, తాను ఐఐఎం పట్టభద్రుడు కావడంతో ఆ కుటుంబ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నేటి డిజిటల్ యుగంలో జీతం రాగానే ఫోన్లో వచ్చే ‘శాలరీ క్రెడిటెడ్’ మెసేజ్ ఇచ్చే ఆనందం కంటే, మొదటి సంపాదనను కవర్ లో పెట్టి కన్నవారి చేతుల్లో పెట్టినప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్లలో కనిపించే తృప్తే వేరని నిరూపించాడు అశ్వజీత్ కాంబ్లే అనే యువకుడు. ఐఐఎం చదువు పూర్తయ్యాక వచ్చిన తన మొదటి జీతాన్ని పూర్తిగా బ్యాంకు నుండి నగదు రూపంలో మార్చి, పూణేలోని తన తల్లిదండ్రుల చేతుల్లో పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కోట్ల మంది హృదయాలను కదిలిస్తోంది. ఈ వైరల్ వీడియో వెనుక ఒక సగటు మధ్యతరగతి కుటుంబం ఏళ్ల తరబడి పడిన కష్టం, త్యాగాలు ఉన్నాయి. అశ్వజీత్ అన్నయ్య ఆరేళ్ల పాటు అహోరాత్రులు శ్రమించి, ఇటీవలే యూపీఎస్సీ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి అయ్యాడు. అన్నయ్య చదువుకునే రోజుల్లో అశ్వజీత్ కూడా ఫ్రీలాన్స్ పనులు చేస్తూ తండ్రికి ఆర్థికంగా అండగా నిలిచాడు. ఎన్నో ఏళ్ల నిశ్శబ్ద పోరాటం తర్వాత.. ఒకవైపు పెద్దకొడుకు ఐఎఫ్ఎస్ అధికారి కావడం, మరోవైపు చిన్నకొడుకు ఐఐఎం పూర్తి చేసి తన మొదటి శాలరీని చేతికి అందించడంతో ఆ తల్లిదండ్రులు ఆనందం వర్ణనాతీతం. కుమారుడు చేసిన పనికి తల్లిదండ్రులు ఆనందంతో కన్నీటిపర్యంతమయ్యారు. “ఈ విజయం మా అమ్మనాన్నల త్యాగాల ప్రతిరూపం” అని అశ్వజీత్ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. కష్టం విలువ తెలిసిన పిల్లలు కన్నవారికి ఇచ్చే అతిపెద్ద కానుక ఇదేనంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనుషుల పై ఏఐ తిరగబడనుందా? అచ్చం రోబో సినిమాలో చూపినట్లుగా…!

వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది

Jagapathi Babu: పాపం! జాన్వీని తిట్టొద్దు..ఆమె దర్శకుడు చెప్పిందే చేసింది

Jagapathi Babu: ‘పరభాషా నటులతో పోల్చితే అనుకున్నంత గుర్తింపు రావడం లేదు

Peddi: దూసుకుపోతున్న ‘పెద్ది’కి.. అదే పెద్ద పరీక్ష

Follow Us