AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌కు సుదీర్ఘ ప్రధానిగా మోదీ! 4398 రోజుల నెహ్రూ రికార్డుకు బ్రేక్ !

PMO.. ప్రైమ్‌ మినిస్టర్ ఆఫీస్ ఆఫ్ ఇండియా. దేశ పరిపాలనకు గుండెకాయ లాంటిది. సచివాలయాలు ఎగ్జిక్యూటివ్స్‌కి అడ్డా ఐనప్పటికీ, కేంద్రమంత్రుల డ్యూటీచార్ట్‌లు, ప్రోగ్రెస్ రిపోర్టులూ ఖరారయ్యేది మాత్రం పీఎంఓలోనే. ఇండియన్ సివిల్ సర్వీస్‌కు చెందిన అత్యున్నతస్థాయి అధికారుల మకాం కూడా ఇక్కడే. కేంద్ర మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం జరిగేది కూడా ఇక్కడే. దేశ గతిని నిర్దేశించే విధాన నిర్ణయాలన్నీ పీఎంఓలోనే డిజైన్ ఔతాయి. అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చే హక్కు కూడా ప్రధాని చేతుల్లోనే ఉండేది. అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అమల్లో ఉంటే, ఇండియాలో మాత్రం ప్రైమ్‌మినిస్టర్‌దే సూపర్‌పవర్. దటీజ్ ది బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమొక్రసీ. అటువంటి పీఎంఓకు దశాబ్దాలపాటు నేతృత్వం వహించే అవకాశం దొరికితే..! ఎస్ PMO of ఇండియాకు లాంగ్‌టైమ్ కెప్టెన్సీ చేసిన ఘనత దక్కించుకుని ఒకేఒక్కడు అనిపించుకున్నారు నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ.

భారత్‌కు సుదీర్ఘ ప్రధానిగా మోదీ! 4398 రోజుల నెహ్రూ రికార్డుకు బ్రేక్ !
Jawaharlal Nehru and Narendra Modi
Ram Naramaneni
|

Updated on: Jun 09, 2026 | 9:40 PM

Share

1952 ఏప్రిల్‌ 17న మొదటిసారి స్వతంత్ర భారతదేశానికి సార్వత్రిక ఎన్నికలు జరిగి, మే 13న తొలిసారి లోక్‌సభ సమావేశమైంది. అదే రోజు ప్రధానిగా ప్రమాణం చేసిన పండిట్ నెహ్రూ 1964 మే 27… ఆఖరిశ్వాస విడిచేవరకూ పదవిలోనే ఉన్నారు. అంటే, 4 వేల 398 రోజులు నెహ్రూ జమానా నడిచింది. నెహ్రూ మరణంతో కాంగ్రెస్‌లో చీలికల సంక్షోభం వచ్చి, అనివార్య పరిస్థితుల్లో లాల్‌బహదూర్ శాస్త్రి ప్రధానిగా ప్రమోట్ అయ్యారు. పార్టీ కుదుటపడ్డాక ఇందిరాగాంధీ చేతికి పగ్గాలొచ్చాయి. ప్రధానిగా ఆమె 1966 జనవరి నుంచి 77 మార్చి దాకా పదకొండేళ్ల రెండునెలలు ప్రధాని కుర్చీలో ఉన్నారు. కానీ, ఇందిరాగాంధీ కంటే, నెహ్రూ జమానానే దాదాపు ఏడాది ఎక్కువ. ఇప్పుడు చాచా నెహ్రూ రికార్డు కూడా చెదిరిపోయింది. మోదీ శకం మొదలయ్యాక దేశ రాజకీయ చిత్రమే పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ విముక్త భారత్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. 2014లో బిగ్గెస్ట్ పొలిటికల్ రెవెల్యూషన్‌ని చూసింది దేశం. 16వ లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించిన ఎన్‌డీఏ కూటమి తరఫున, మే 26న 15వ ప్రధానమంత్రిగా పదవీప్రమాణం చేశారు నరేంద్రమోదీ. తర్వాత రెండుసార్లు కూటమి ఘనవిజయం సాధించి, ప్రైమ్‌మినిస్టర్‌గా మోదీ హ్యాట్రిక్ కొట్టారు. పన్నెండేళ్ల పాటు నాన్‌స్టాప్‌గా పవర్లో ఉన్నారు. 2026 జూన్ 10 నాటికి మోదీ 4 వేల 399 రోజులు అధికారంలో ఉన్నట్టు లెక్క. దేశాన్ని ఎక్కువ కాలం ఏలిన పాలకుడిగా అరుదైన, విశిష్టమైన...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి