AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Walking: మనిషికి నడకలేకపోతే వచ్చే భయంకర రోగాలు ఇవే..

ఈ రోజుల్లో మనిషికి వచ్చిన అతి పెద్ద శాపం ఏంటో తెలుసా? 'సుఖం'. అవును, మనం కూర్చున్న చోట నుండి కదలకుండా అన్ని పనులు అయిపోతున్నాయి. కానీ, ఇదే సుఖం మనల్ని నెమ్మదిగా రోగాల వైపు తీసుకెళ్తోంది. ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం అనేది సిగరెట్ తాగడంతో సమానమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Phani CH
|

Updated on: Jun 09, 2026 | 8:27 PM

Share
మన పూర్వీకులు రోజుకు కిలోమీటర్ల కొద్ది నడిచేవారు, అందుకే వారు ఎలాంటి రోగాలు లేకుండా వంద ఏళ్లు బ్రతికారు. మరి ఈరోజు మనం ఎందుకు చిన్న వయసులోనే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాం? నడక వెనుక ఉన్న ఆ అసలు రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 7
మన మానవ శరీరం కదలడానికి డిజైన్ చేయబడింది, కానీ కుర్చీలోనో సోఫాలోనో గంటల తరబడి కూర్చోవడానికి కాదు. మనం ఎప్పుడైతే కదలకుండా ఒకే చోట ఉండిపోతామో, అప్పుడు శరీరంలో మెటబాలిజం 90% పడిపోతుంది. నిలిచిన నీరు ఎలా కుల్లిపోతుందో, కదలని శరీరం కూడా అలాగే రోగాల పుట్టగా మారుతుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల

2 / 7
మొదటగా వచ్చేది టైప్-2 డయాబెటిస్. మనం నడుస్తున్నప్పుడు మన శరీరంలోని కాళ్ళు, పిక్కల కండరాలు నిరంతరం కదులుతాయి. ఈ కదలిక వల్ల కణాలు రక్తంలోని గ్లూకోజ్‌ను స్పాంజ్ లాగా పీల్చుకుంటాయి. కానీ నడవకపోతే కణాలు ఇన్సులిన్ మాట వినడం మానేస్తాయి, దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పెరిగిపోతాయి.

3 / 7
రెండవది గుండె జబ్బులు. మనం నడవకుండా కూర్చుంటే రక్త ప్రసరణ మందగించి, బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడలకు పేరుకుపోతుంది. చివరకు ఇది సడన్ హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్‌కు దారితీస్తుంది. అలాగే, కదలకుండా కూర్చోవడం వల్ల కొవ్వు కరిగించే ఎంజైమ్ ఉత్పత్తి ఆగిపోతుంది. దాంతో మనం ఎంత తక్కువ తిన్నా ఆ కొవ్వు అంతా పొట్ట చుట్టూ, లివర్ చుట్టూ పేరుకుపోయి ఊబకాయాన్ని పెంచుతుంది.

4 / 7
మూడొవది నడక లేకపోతే కేవలం శారీరక రోగాలే కాదు, అంతకంటే భయంకరమైన మానసిక రోగాలు కూడా వస్తాయి. మనం నడుస్తున్నప్పుడు మెదడులో సెరటోనిన్, డోపమైన్ వంటి 'హ్యాపీ హార్మోన్స్' విడుదలవుతాయి. ఇవి మనల్ని ప్రశాంతంగా ఉంచుతాయి. రోజంతా ఒకే చోట ఉండిపోతే ఒత్తిడి హార్మోన్లు పెరిగి కోపం, చిరాకు, డిప్రెషన్ మరియు నిద్రలేమి సమస్యలు వస్తాయి. వీటితో పాటు, శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల కోలన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

5 / 7
మరి రోజుకు కేవలం 30 నుండి 45 నిమిషాలు నడిస్తే శరీరంలో ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో తెలుసా? నడక అనేది ఒక ఇన్స్టంట్ ఎనర్జీ బూస్టర్. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. మెదడుకు రక్త ప్రసరణ పెరిగి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్‌ల నుండి రక్షణ లభిస్తుంది.

6 / 7
నిజం చెప్పాలంటే, నడక అనేది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేని ప్రపంచంలోనే బెస్ట్ మెడిసిన్. భవిష్యత్తులో హాస్పిటల్ బెడ్‌పై పడుకుని డాక్టర్లకు లక్షల రూపాయల ఫీజులు కట్టడం కంటే, ఈ రోజు నుండే ఒక అరగంట నడవడం చాలా సులభం. కాబట్టి, మీ శరీరాన్ని కదిలించండి, రోగాలను తరిమికొట్టండి. రేపటి నుండి నేను నా ఆరోగ్యం కోసం కచ్చితంగా నడుస్తానని ఈ క్షణమే మీకు మీరే ప్రామిస్ చేసుకోండి. ఆరోగ్యంగా జీవించండి!

7 / 7
Follow Us