AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గీజర్లతో ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రయాణికులు.. డౌట్ వచ్చి ఓపెన్ చేయగా.. మైండ్ బ్లాక్..

మరోసారి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ స్థాయిలో బంగారం పట్టుబడింది. కౌలాలంపూర్ నుంచి ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను నుంచి రూ.5 కోట్లకు పైగా విలువైన 15.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు.

Viral Video: గీజర్లతో ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రయాణికులు.. డౌట్ వచ్చి ఓపెన్ చేయగా.. మైండ్ బ్లాక్..
Hydroponic Weed Seized Igi Airport
Anand T
|

Updated on: Jun 09, 2026 | 9:43 PM

Share

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ ఎత్తున డ్రగ్స్‌ పట్టు బడ్డాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 5.4 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ వీడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. కౌలాలంపూర్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్రయాణికుల.. తమ లగేజ్‌తో పాటు రెండు బ్రాండ్ న్యూ గీజర్లను తీసుకొని వచ్చారు. దీంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వారిని అడ్డుకున్నారు.

సదరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని గట్టిగా నిలదీయడంతో పాటు, వారి మొబైల్ ఫోన్ చాటింగ్‌లు, కమ్యూనికేషన్‌ను అధికారులు పరిశీలించారు.దీంతో గీజర్లలో ఏదో తేడా ఉందనే అనుమానం వ్యక్తమైంది. దీంతో కస్టమ్స్ అధికారులు ఆ రెండు గీజర్లను పూర్తిగా విప్పి, లోపలి భాగాలను పరిశీలించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. గ్లీజర్‌లో లోపల వారికి అత్యంత చాకచక్యంగా వ్యాక్యూమ్ సీల్డ్ చేసిన 145 ప్యాకెట్లు కనిపించాయి.

ఆ ప్యాకెట్లను తెరిచి చూడగా అందులో అత్యంత ఖరీదైన హైడ్రోపోనిక్ వీడ్ కనిపించింది. పట్టుబడిన గంజాయి మొత్తం15.4 కిలోగ్రాములు ఉంటుందని.. బ్లాక్‌ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 5.4 కోట్లు వరకు ఉండవచ్చని కస్టమ్స్ అధికారి తెలిపారు. ఇక నిందితుల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్న అధకారులు ఇద్దరి ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై అంతర్జాతీయ గంజాయిని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు..
క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు..
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..