నెల్లూరు జిల్లా నుండి కాశీ యాత్రకు బయలుదేరిన యాత్రికుల బస్సు బీహార్లోని ఔరంగాబాద్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. జూన్ 1న బయలుదేరిన ఈ బస్సును ఆదివారం లారీ ఢీకొట్టడంతో ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో సంగం, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన వారున్నారు.