AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode Bypoll: మనుగోడులో పోస్టర్ల కలకలం.. ‘కాంట్రాక్ట్ పే’ పేరుతో రాజగోపాల్‌ రెడ్డిపై ఆరోపణలు..

మునుగోడులో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాజగోపాల్‌ రెడ్డి నామినేషన్‌ వేసిన రాత్రే చండూరులో భారీగా పోస్టర్లు అతికించడం ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయింది.

Munugode Bypoll: మనుగోడులో పోస్టర్ల కలకలం.. ‘కాంట్రాక్ట్ పే’ పేరుతో రాజగోపాల్‌ రెడ్డిపై ఆరోపణలు..
Munugode Posters
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 14, 2022 | 4:59 PM

Share

మునుగోడులో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాజగోపాల్‌ రెడ్డి నామినేషన్‌ వేసిన రాత్రే చండూరులో భారీగా పోస్టర్లు అతికించడం ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయింది. ఫోన్‌ పే తరహాలో కాంట్రాక్ట్‌ పే తరహాలో 18వేల కోట్ల ట్రానాక్షన్‌ రాజగోపాల్‌ ఖాతాలో జరిగిందంటూ పోస్టర్లు వెలిశాయి. రాజగోపాల్‌ రెడ్డికి 18వేల కోట్లు కాంట్రాక్ట్‌ కేటాయించారంటూ వేల సంఖ్యలో షాపులు, గోడలకు రాత్రికే రాత్రి కొందరు అతికించారు.

ఇక మునుగోడ బై పోల్‌ ప్రచారంలో సవాళ్ల పర్వం తెరపైకి వచ్చింది. కాంట్రాక్ట్‌ వ్యవహారంలో కారు-కమలం మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయ్‌. రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు ఇచ్చిందన్న మంత్రి జగదీశ్‌ రెడ్డి.. ఆ డబ్బులేవో జిల్లా అభివృద్ధికి ఇస్తే ఎన్నికల్లో పోటీనుంచే తప్పుకుంటామని సవాల్‌ విసిరారు. మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. బీజేపీకి తాను అమ్ముడుపోలేదన్నారు. కాంట్రాక్ట్‌ విషయంలో ప్రమాణం చేసేందుకు లక్ష్మినర్సింహ్మస్వామి ఆలయానికి తడిబట్టలతో వస్తానని.. దీనికి కేటీఆర్‌, కేసీఆర్‌ సిద్ధమా? అని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సవాల్‌ విసిరారు.

అయితే రాజగోపాల్ రెడ్డి చేసే ప్రమాణాలకు విలువే లేదని టీఆరెఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి ఆయన కుటుంబ అభివృద్ధి కోసమే రాజీనామా చేశాడు తప్ప నియోజకవర్గ ప్రజల కోసం కాదని అన్నారు. రాజగోపాల్ రెడ్డినీ ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఫోన్ పే వివరణ ఇది..

“‘Contract Pe’పై కొన్ని ప్రసార మాధ్యమాలలో వస్తున్న వార్తలతో ‘PhonePe’కు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ పేర్కొంది. మా కంపెనీకి ఏ పార్టీతో కానీ, అభ్యర్థితో కానీ ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు. ‘Contract Pe’ను రూపొందించడంలో PhonePe లోగోను ఉపయోగించడం అనేది తప్పుదారి పట్టించేది మాత్రమే కాక, PhonePe మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించడం కూడా కాగలదు. దీనికి సంబంధించి భవిష్యత్తులో తగిన చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు PhonePe కలిగి ఉంది. అని స్పష్టం చేసింది”

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..