Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Girls Safety Tricks: క్యాబ్ ప్రయాణంలో అనుమానం వస్తే వెంటనే ఇలా చేయండి.. సేఫ్‌గా బయటపడొచ్చు.. ఆ టిప్స్ ఇవే..

ఈ రోజుల్లో అమ్మాయిలు, మహిళలపై జరుగుతున్న నేర సంఘటనల వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఒంటరిగా ఉన్న అమ్మాయిలు ఎలా జాగ్రత్తగా వ్యవహరించాలి.. ఏదైనా జరుగుతున్నట్లుగా అనుమానం వచ్చిన వెంటనే తక్షణ రక్షణ కోసం కొన్ని సురక్షిత చిట్కాలను అనుసరించాలి..

Girls Safety Tricks: క్యాబ్ ప్రయాణంలో అనుమానం వస్తే వెంటనే ఇలా చేయండి.. సేఫ్‌గా బయటపడొచ్చు.. ఆ టిప్స్ ఇవే..
Basic Street Safety Tips
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 11, 2022 | 10:06 AM

దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాల సంఘటనలను మీరు తరచుగా చదివి.. విని ఉంటారు. బిల్డింగ్ లిఫ్ట్ అయినా, ఆటో-టాక్సీ అయినా, ఎక్కడైనా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లినా.. మహిళలతో నిత్యం జరిగే అసంఘీక శక్తులు దాడి చేస్తూనే ఉంటాయి. ఈ ఘటనల తర్వాత బాధితురాలి పట్ల పోలీసులు-పరిపాలన తీరు ఏంటో అందరికీ తెలిసిందే. అటువంటి సంఘటన మీకు ఎప్పుడూ జరగకుండా ఉండేందుకు.. ఈరోజు మనం ఉమెన్ సేఫ్టీ ట్రిక్స్‌కి సంబంధించిన కొన్ని ప్రత్యేక చిట్కాలను తెలుసుకుందాం. మీరు ఈ చిట్కాలను మీ మనస్సులో ఉంచుకుంటే.. మీకు ఎటువంటి చెడు సంఘటన జరగవు. 

లిఫ్ట్‌లో అపరిచితుడితో ఒంటరిగా ఇరుక్కుపోతే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మీరు ఎత్తైన భవనం (ఉమెన్ సేఫ్టీ ట్రిక్స్) లిఫ్ట్‌లో వెళుతుంటే ఆ లిఫ్ట్‌లో మీరు కాకుండా అపరిచితుడు ఎవరైనా ఉన్నట్లయితే భయపడవద్దు. మీరు లిఫ్ట్‌లోని అన్ని అంతస్తుల బటన్‌లను నొక్కండి. ఇలా చేయడం ద్వారా ఆ లిఫ్ట్ ప్రతి అంతస్తులో ఆగిపోతుంది. తద్వారా తెలియని వ్యక్తి ఎటువంటి నేరం చేయడానికి సాహసించడు. ఒక్కో ఫ్లోర్‌లో లిఫ్ట్‌ ఆగిపోయే పరిస్థితుల్లో ఎవరూ దాడి చేయలేకపోవడమే ఇందుకు కారణం.

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరైనా దాడి చేస్తే..?  

పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఒక మహిళ ఒంటరిగా ఉండి.. ఆ సమయంలో ఒకరు లేదా పలువురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దాడి చేస్తే.. అప్పుడు వెంటనే వంటగది వైపు పరుగెత్తాలి. వంటగదిలోని మిర్చి పొడి లేదా పసుపు ఎక్కడ ఉందో మనకు ముందుగానే తెలిసి ఉండాలి. వంటగదిలోని ఈ వస్తువులన్నీ మీ భద్రతకు గొప్ప సాధనంగా పనిచేస్తాయి. అంతే కాదు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి.. దాడి చేసేవారిపైకి ఆ వంట గదిలోని వంట పాత్రలను గట్టిగా విసిరి, అరవడం మొదలు పెట్టాలి. మీరు ఇలా చేయగానే దాడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు. వాస్తవానికి శబ్దం అటువంటి వ్యక్తులకు అతిపెద్ద శత్రువు. వారు తమంతట తాముగా పట్టుబడటానికి ఇష్టపడరు.  

రాత్రిపూట ఆటో లేదా టాక్సీలో ప్రయాణిస్తున్నప్పుడు! 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాత్రిపూట ఆటో లేదా ట్యాక్సీలో ఒంటరిగా ప్రయాణించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రయాణిస్తున్న వాహనం నంబర్‌ను మీ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితుడికి ఫార్వార్డ్ చేయాలి. అలాగే, మొబైల్‌లో మాట్లాడుతూ, అటువంటి నంబర్‌కు చెందిన ఆటో-టాక్సీలో మీరు ఇంటికి వస్తున్నారని ముందే చెప్పడం మంచిది. మీరు మొబైల్‌లో మాట్లాడలేకపోయినా లేదా సందేశాన్ని ఫార్వార్డ్ చేయలేకపోయినా భయపడవద్దు. మీరు మీ మొబైల్‌ని ఆ డ్రైవర్ ముందు ఉంచి.. మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు షో చేయండి. మీరు మీ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితుడికి వాహనం వివరాలను అందించారు. ఇది డ్రైవర్‌కు తన వాహనం గురించిన వివరాలు తెలుసుకుని.. మహిళా ప్రయాణీకురాలిపై ఏదైనా తప్పు చేస్తే వెంటనే పట్టుకుంటారనే అభిప్రాయం డ్రైవర్‌కు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అతను ఎటువంటి రిస్క్ తీసుకోడు. మిమ్మల్ని సురక్షితంగా ఇంటికి తీసుకువెళతాడు. ఇది మాత్రమే కాదు.. ఇప్పుడు అతను మీ భద్రతను కూడా చూసుకుంటాడు.  

డ్రైవర్ తప్పు ట్రాక్‌లో కారును తీసుకెళ్లడం ప్రారంభిస్తే..? 

మహిళా భద్రతకు సంబంధించిన పోలీసు అధికారులు అందించిన సమాచారం మేరకు, క్యాబ్-టాక్సీ డ్రైవర్ తప్పుడు ఉద్దేశ్యంతో మహిళా ప్రయాణీకులను తప్పుడు మార్గంలో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే.. ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు. ఇందుకు బదులుగా మీరు మీ పర్స్ హ్యాండిల్‌ను అతని మెడ చుట్టూ చుట్టి లాగండి. ఆ వ్యక్తి కొన్ని సెకన్లలో నిస్సహాయంగా మారి కారును ఆపివేస్తాడు. మీ దగ్గర బ్యాగ్ లేకపోతే మీ దుపట్టాను అతని మెడకు చుట్టి.. మీ వైపుకు తిరిగి లాగండి. మీ దగ్గర పర్సు, స్కార్ఫ్ లేకపోయినా భయపడకండి. మీరు అతని చొక్కా కాలర్‌ను వెనుక నుండి పట్టుకుని లాగండి. అటువంటి పరిస్థితిలో అతను వేసుకున్న చొక్కా బటన్ కూడా మీ బ్యాగ్ లేదా దుపట్టా లాగా పని చేస్తుంది. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు ఇది అవకాశంగా మారుతుంది. 

రాత్రి నడుస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని అనుసరించడం ప్రారంభించారా?  

మీరు రాత్రిపూట ఒంటరిగా కాలినడకన వెళ్తుంటే (ఉమెన్ సేఫ్టీ ట్రిక్స్) ఎవరైనా మిమ్మల్ని అనుసరిస్తున్నట్లు మీకు అనిపిస్తే సమీపంలోని ఏదైనా తెరిచిన దుకాణం లేదా ఇంట్లోకి ప్రవేశించి మీ సమస్యను వారికి చెప్పండి. సహాయం కోసం అడగండి. రాత్రి కావడంతో ఇళ్లు, దుకాణాలు మూసి ఉంటే సమీపంలోని ఏటీఎం బూత్‌లోకి ప్రవేశించి లోపలి నుంచి తాళం వేసుకోండి. ఏటీఎం బూత్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మీ గుర్తింపును బహిర్గతం చేస్తారనే భయంతో ఏ నేరస్థుడు మీపై దాడి చేయడానికి సాహసించడు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం