AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International girl child day: నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం.. ఈ రోజు ప్రాముఖ్యత, చరిత్ర ఏంటంటే..

ప్రతీ ఏటా అక్టోబర్‌ 11వ తేదీని అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలపై ఉండే వివక్షతను, హింసను, బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆడబిడ్డల ప్రాముఖ్యతను..

International girl child day: నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం.. ఈ రోజు ప్రాముఖ్యత, చరిత్ర ఏంటంటే..
International Girl Child Day
Narender Vaitla
|

Updated on: Oct 11, 2022 | 9:27 AM

Share

ప్రతీ ఏటా అక్టోబర్‌ 11వ తేదీని అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలపై ఉండే వివక్షతను, హింసను, బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆడబిడ్డల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఐక్యరాజ్య సమితి ఈ కార్యక్రమాన్ని ఏటా చేపడుతుంది. ఐక్యరాజ్య సమితి అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ ఏడాది బాలికలకు సంబంధించి అన్ని రకాల సమస్యలపై ప్రస్తావించనున్నారు. ప్రభుత్వాలను, పాలసీ మేకర్స్‌ను, సాధారణ ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు.

ప్రతీ ఏటా అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఏదో ఒక ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తుంటారు. ఈ ఏడాదికిగాను ‘ఇది మన సమయం, మన హక్కులు, మన భవిష్యత్తు’ అనే థీమ్‌తో నిర్వహించనున్నారు. బాలికలు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి వారి ముందున్న సవాళ్లపై దృష్టిసారించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వాతావరణ మార్పులు, కోవిడ్‌ 19 మహమ్మారి తర్వాత మానవ సంబంధాల్లో ఏర్పడ్డ సంఘర్షణల నేపథ్యంలో బాలికలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాలికలు విద్య, శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీటన్నంటిపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే లక్ష్యంతో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలికలకు సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కథనాలను, వీడియోలను అందరితో పంచుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రజలకు పిలుపునిచ్చింది.

చరిత్ర ఏంటంటే..

అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించడం వెనకాల పెద్ద చరిత్రే ఉంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 19, 2011 న, అక్టోబర్ 11 ని అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ప్రకటించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ రోజు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి వారి మానవ హక్కులను నెరవేర్చే దిశగా వారిని శక్తివంతం చేయడంపై దృష్టి సారించింది. అణగారిన బాలికల హక్కుల తరఫున గొంతు కావాలనేదే ఈ రోజు ప్రాముఖ్యత. బాలికలకు మెరుగైన ఆరోగ్య సేవలు, విద్యలో సమాన అవకాశాలు, లింగ-ఆధారిత వివక్ష, బాలికలపై హింసలేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..