ఆగని అఘాయిత్యాలు.. తల్లి ముందే మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్‌..

రెండు బైక్‌లపైన వచ్చిన దుండగులు..తల్లీ, కూతుళ్లను బలవంతంగా బహదూర్‌పూర్‌ అడవుల్లోకి తీసుకెళ్లారు. ఐదుగురు యువకులు తల్లి ఎదుటే మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆగని అఘాయిత్యాలు.. తల్లి ముందే మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్‌..
Deoghar
Follow us

|

Updated on: Oct 11, 2022 | 9:35 AM

మైనర్‌ బాలికపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న మహిళలపై నేరాల ఘటనలు చూస్తుంటే నేరగాళ్లలో చట్టం, పోలీసుల భయం ఏ మాత్రం లేదని అనిపిస్తోంది. జార్ఖండ్‌లో ప్రతిరోజూ నేరగాళ్లు తీవ్ర ఘటనలకు పాల్పడుతున్నారు. కొన్ని కేసుల్లో అరెస్టులు జరుగుతున్నా పెరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట పడడం లేదు. వృద్ధుల నుండి మైనర్ బాలికల వరకు ప్రతిరోజూ అత్యాచారాలు, దోపిడీకి గురవుతున్నారు. జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లా పరిధిలోని బహదూర్‌పూర్ గ్రామంలో మైనర్‌ బాలికపై ఐదుగురు దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తల్లితో పాటు ఉన్న కూతురిని సహా నిర్జన ప్రదేశంలోకి లాకేళ్లారు. తల్లి ఎదుటే తన మైనర్ కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి గురైన బాధితురాలి పరిస్థితి చాలా విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం మైనర్‌ను సబ్‌డివిజన్ హాస్పిటల్ నుండి సదర్ హాస్పిటల్ డియోఘర్‌కు రెఫర్ చేశారు. అధిక రక్తస్రావం కారణంగా బాలిక పరిస్థితి చాలా విషమంగా ఉంది. మైనర్ వయస్సు 15 సంవత్సరాలు.

సామూహిక అత్యాచారానికి గురైన మైనర్ తల్లి రజియా ఖాతూన్, తాను దుమ్కాలోని తీన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్హర్ తోలిలో నివసిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి బిడ్డ పుట్టిన సందర్భంగా జరుపుకునే బారసాల, పురుడు కార్యక్రమాల్లో డ్యాన్స్, పాటలు పాడే పని చేస్తూ జీవనం గడుపుతున్నారు. గత రాత్రి కూడా అలాంటి కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఆమె 15 ఏళ్ల మైనర్ కుమార్తెతో కలిసి తమ గ్రామానికి బయల్దేరింది. కానీ, అనుకోని కారణాల వల్ల కార్యక్రమం రద్దు చేయబడింది. దాంతో తల్లి, కూతురు ఇద్దరూ మధుపూర్ వరకు కాలినడకన బయల్దేరారు. ఇంతలోనే రెండు బైక్‌లపైన వచ్చిన దుండగులు..తల్లీ, కూతుళ్లను బలవంతంగా బహదూర్‌పూర్‌ అడవుల్లోకి తీసుకెళ్లారు. ఐదుగురు యువకులు తల్లి ఎదుటే మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూతురిపై అత్యాచార ఘటనను అడ్డుకోబోయిన తల్లిని దుండగులు దారుణంగా కొట్టి నగదు, వారి వద్దనున్న మొబైల్ ఫోన్‌ లాక్కొని పారిపోయారు. తమకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

దుమ్కా జిల్లాకు చెందిన బాలిక, ఆమె తల్లి ఆదివారం డియోఘర్‌లోని ఒక కార్యక్రమంలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తుండగా మధుపూర్ ప్రాంతంలో దాడికి గురైనట్లు సబ్-డివిజనల్ పోలీసు అధికారి బి రౌత్, ఈ కేసులో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఉటంకిస్తూ తెలిపారు. ఆమె తల్లి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురిలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురికోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, మరోవైపు రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న నేరాలు, అత్యాచార ఘటనలపై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న అత్యాచార కేసులు, శాంతిభద్రతల పరిస్థితి పడిపోవడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని నేతలు ట్వీట్లు చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest Articles
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్
కంత్రీ స్కెచ్‌తో పోలీసులకే ఫ్యూజులౌట్.. ఆఖరికి దేన్ని వదలట్లేదుగా
కంత్రీ స్కెచ్‌తో పోలీసులకే ఫ్యూజులౌట్.. ఆఖరికి దేన్ని వదలట్లేదుగా
నల్లని పుట్టి పచ్చ ఈ వయ్యారికి దిష్టి తీస్తుందేమో..
నల్లని పుట్టి పచ్చ ఈ వయ్యారికి దిష్టి తీస్తుందేమో..
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన రోహిత్
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన రోహిత్
రష్మిక మందన్న చెల్లెలు ఎంత క్యూట్‏గా ఉందో చూశారా..?
రష్మిక మందన్న చెల్లెలు ఎంత క్యూట్‏గా ఉందో చూశారా..?
నేను పిఠాపురంలో ఎందుకు పుట్టలేదని బాధపడుతున్నా: హైపర్‌ ఆది
నేను పిఠాపురంలో ఎందుకు పుట్టలేదని బాధపడుతున్నా: హైపర్‌ ఆది