Surya Gochar 2022: దీపావళికి ముందు సూర్య సంచారం.. ఈ ఐదు రాశుల వారికి కష్టాలు తప్పవు..! పరిష్కారం కోసం ఏం చేయాలంటే..

ఈ రోజున సూర్యుడు కన్యారాశిని వదిలి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా పలు రాశుల వారిపై ఈ సంచార కాలంతో చాలా ప్రయోజనం పొందుతారు. అదే సమయంలో సూర్య సంచారంతో ఈ 5 రాశుల వారికి కష్టాలు మొదలవుతాయి.

Surya Gochar 2022: దీపావళికి ముందు సూర్య సంచారం.. ఈ ఐదు రాశుల వారికి కష్టాలు తప్పవు..! పరిష్కారం కోసం ఏం చేయాలంటే..
Astrology
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 11, 2022 | 7:35 AM

గ్రహాల రాజుగా పిలువబడే సూర్య దేవుడు అక్టోబర్ 17న తన రాశిచక్రాన్ని మారబోతున్నాడు. ఈ రోజున సూర్యుడు కన్యారాశిని వదిలి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా పలు రాశుల వారిపై ఈ సంచార కాలంతో చాలా ప్రయోజనం పొందుతారు. అదే సమయంలో ఈ 5 రాశుల వారిపై సూర్యుడి సంచార సమయంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. సూర్య సంచారం వలన 5 రాశుల వారికి కష్టాలు మొదలవుతాయి. వారు చేస్తున్న పనులు కూడా చెడిపోతుంటాయి. ఇంట్లో కలహాలు ఏర్పడతాయి. దీని నుండి ఉపశమనం పొందడానికి, వారు వెంటనే కొన్ని చర్యలు తీసుకోవాలి. దీనికి పరిష్కారం కోసం ఆయా రాశుల వారు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

కుంభం: ఈ రాశి వారు సూర్య గ్రహ సంచారం వల్ల కుటుంబ జీవితంలో వివాదాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇంట్లో అసమ్మతి పెరుగుతుంది. దీని కారణంగా మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇటువంటి పరిస్థితులు కార్యాలయంలో సృష్టించబడతాయి. ఇది మీకు ఇబ్బందికరంగా మారుతుంది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. కొత్త పనులు, ప్రయాణాలు ప్రారంభించవద్దు. ఉపశమనం పొందడానికి,.. సూర్య గ్రహానికి సంబంధించిన మంత్రాలను 108 సార్లు జపించండి.

కర్కాటకం: ఈ రాశి వారు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ మాటతీరు కఠినంగా ఉంటుంది. దీని కారణంగా ఇతరులతో మీకు వివాదాలు పెరుగుతాయి. మీరు చేస్తున్న పనులను సకాలంలో పూర్తి చేయలేకపోతారు. ప్రతిరోజూ ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు. మీరు కొత్త ఆస్తి లేదా వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఖచ్చితంగా పెద్దల సలహా తీసుకోవటం మంచిది.

ఇవి కూడా చదవండి

మేషం: వ్యాపారాలు చేసే వారికి సమయం అనుకూలంగా ఉండదు. వ్యాపారంలో ఏదైనా కొత్త ఒప్పందం చేసుకునే ముందు, అన్ని పేపర్లను సరిగ్గా చదవండి. మీ వాటా, షేర్లపట్ల జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ సంభాషణలో చేదు పదాలను ఉపయోగించవద్దు. వివాహితుల జీవితంలో భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. సనుకూలంగా చర్చించుకుంటే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఆ దిశగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఉదయించే సూర్యుడిని కళ్లు తెరిచి చూడండి.

కన్య: ఈ రాశి వారు ఆదాయానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వారి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా పనిని సకాలంలో పూర్తి చేయడంలో సమస్యలు ఉండవచ్చు. మీరు పనిచేసే చోట, సహోద్యోగులతో విభేదాలు ఉండవచ్చు. దారిలో వెళ్తుండగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఉండవచ్చు. పరిహారం కోసం, ప్రతిరోజూ ఆదిత్య హృదయ్ స్తోత్రాన్ని చదవడం ప్రారంభించండి.

మిథునం: సూర్య గ్రహ సంచారం (సూర్య గోచరం 2022) మీ వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను తెస్తుంది. కష్టపడి పని చేసినా, మీ కోరిక మేరకు ఫలితాలు సాధించలేరు. దాని వల్ల మీకు కోపం పెరుగుతుంది. ఈ కోపం మీ కార్యాలయంలో, కుటుంబంలో బయటపెడుతుంటారు. అలా చేయడం వల్ల మీ ఇమేజ్ ప్రభావితం డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం ఉంది. ఈ చెడు సమయం నుండి బయటపడేందుకు ఆదివారం నాడు రాగి పాత్రలో నీటిని తీసుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. మీకు ఉపశమనం లభిస్తుంది.

నోట్‌: రాశిఫలాలు అనేవి వ్యక్తిగత నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొందరు నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ అందించడం జరిగింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..