Hyderabad TTD: ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు.. Watch Live
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఉత్సవాలు ప్రారంభమవగా.. కలియుగ దైవం శ్రీనివాసునికి సుప్రభాత సేవ వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సుప్రభాత సేవ అనంతరం ఉదయం 6:30 కు తోమాల సేవ, 7:30 కు అర్చన, ఉదయం 9:30 కు రెండవ నివేదన, ఉదయం 10 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదున్నర గంటలకు సహస్ర దీపాలంకరణ సేవ, సాయంత్రం 6:30 కు వీధి ఉత్సవం, రాత్రి ఏడున్నర గంటలకు రాత్రి కైంకర్యం, రాత్రి 8:30 గంటలకు ఏకాంత సేవ మొదలైన నిత్యోత్సవాలు నిర్వహణ చేస్తారు. అలాగే వారోత్సవాలైన అష్టదళపాద పద్మారాధన, సహస్రకలశాభిషేకం, తిరుప్పాడవ, పురాభిషేకం నిర్వహిస్తారు.
ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యి ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు తిరుమల మాడవీధుల్లో లాగా తిరుచ్చిపై ఉత్సవ విగ్రహాల ఊరేగింపును భక్తుల సమక్షంలో నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి జరగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాల్లో సాయంత్రం గవర్నర్ తమిళి సై, మంత్రి హరీష్ రావు, బిజెపి ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ దర్శించుకోనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..