AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మేష రాశి వారికి ఎలా ఉందంటే..?

Ugadi 2026 Aries Horoscope: వ్యయస్థాన శని, లాభస్థాన రాహువు, జూన్ నుంచి చతుర్థంలో ఉచ్ఛ గురువు ప్రభావంతో మేష రాశి వారికి ఉగాది వరకు శుభఫలితాలు అనుభవానికి వస్తాయి. గురుదృష్టి వల్ల శని దోషం గణనీయంగా తగ్గి, ఆర్థికంగా లాభాలు పెరుగుతాయి. జూన్ తర్వాత ఆదాయం మెరుగై ఆస్తుల విలువ పెరుగుతుంది. అయితే ఖర్చులపై నియంత్రణ అవసరం. కుటుంబంలో శుభకార్యాలు, దాంపత్య ఆనందం, పిల్లల నుంచి శుభవార్తలు లభిస్తాయి.

Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మేష రాశి వారికి ఎలా ఉందంటే..?
Mesha Rashi Ugadi 2026 Forecast
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 18, 2026 | 12:19 PM

Share

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు..

ఆదాయం-11, వ్యయం-5 | రాజపూజ్యం-2, అవమానం-4

వ్యయ స్థానంలో శని, లాభ స్థానంలో రాహువు, జూన్ మొదటి వారం నుంచి చతుర్థంలో ఉచ్ఛ స్థితిలో గురువు సంచారం వల్ల మేష రాశివారికి వచ్చే ఉగాది వరకు మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యయంలో ఉన్న శని మీద గురువు దృష్టి పడడం వల్ల ఏలిన్నాటి శని దోషం దాదాపు పూర్తిగా తొలగిపోతుంది.

ఆర్థిక వ్యవహారాలుః ఆర్థిక విషయాల్లో ఎక్కువగా లాభదాయక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జూన్ నుంచి ఆర్థిక ఇబ్బందులు చాలావరకు తగ్గిపోతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగు తుంది. ఆదాయం ఆశించిన దాని కంటే బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ, ఖర్చుల మీద అదుపు ఉండకపోవచ్చు. స్నేహితులతో విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.

ఉద్యోగ జీవితంః నిరుద్యోగులకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. సరైన ప్రయ త్నాలు, నిర్ణయాలతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు సజావుగా, లాభదాయకంగా సాగిపోతాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది.

కుటుంబ జీవితంః ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.

Follow Us