Hostel photos: పిల్లల హాస్టల్ ఫోటోలు వైరల్! చూసి షాక్‌ అవుతున్న నెటిజన్లు.. అసలు కారణం ఏంటంటే..

కోటా దేశంలోనే పోటీ పరీక్షలకు కోచింగ్ సెంటర్‌గా గుర్తింపు పొందింది. కోచింగ్ కోసం దేశం నలుమూలల నుంచి విద్యార్థులు కోటాకు వస్తుంటారు.

Hostel photos: పిల్లల హాస్టల్ ఫోటోలు వైరల్! చూసి షాక్‌ అవుతున్న నెటిజన్లు.. అసలు కారణం ఏంటంటే..
Ceiling Fan
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 11, 2022 | 8:44 AM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో అనేకం మనల్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే… మరికొన్ని షాక్‌కు గురిచేస్తాయి. అలాంటిదే ఇక్కడ ఓ విచిత్ర ఫోటో నెటిజన్లను లోతుగా ఆలోచించేలా చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. కోటాలోని విద్యార్థుల హాస్టల్‌లోని ఫోటో అని ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. ఫ్యాన్‌ కింద ఈ నెట్‌ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. వినియోగదారులందరూ దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకే ఇలా చేశామన్నారు.

కోటా దేశంలోనే పోటీ పరీక్షలకు కోచింగ్ సెంటర్‌గా గుర్తింపు పొందింది. కోచింగ్ కోసం దేశం నలుమూలల నుంచి విద్యార్థులు కోటాకు వస్తుంటారు. అయితే, ఇటీవలి కాలంలో ఆత్మహత్యల సంఘటనలు కూడా ఇక్కడ వేగంగా పెరిగాయి. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. చాలా ఆత్మహత్యలు సీలింగ్ ఫ్యాన్‌లకు ఉరివేసుకుని జరుగుతున్నాయి. దీన్ని నివారించేందుకు ఓ హాస్టల్‌ ఫ్యాన్‌ కింద నెట్‌ను అమర్చింది.

ఇవి కూడా చదవండి

ట్విట్టర్ హ్యాండిల్ @గబ్బర్ సింగ్ అక్టోబర్ 3న ఈ ఫోటోను షేర్ చేశారు. కోటలోని విద్యార్థి హాస్టల్‌లో ఎందుకు ఇలా జరుగుతోందని క్యాప్షన్‌లో ప్రశ్నించారు. కాగా, ఈ ట్వీట్‌కు వేల సంఖ్యలో లైకులు, కొన్ని వేల సంఖ్యలో రీట్వీట్లు వచ్చాయి. అలాగే, ఈ వ్యక్తి ప్రశ్నకు వందలాది మంది వినియోగదారులు సమాధానమిచ్చారు.

చాలా మంది వినియోగదారులు విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడానికి ఇలా చేశారంటూ చెప్పారు. అయితే కొంతమంది వినియోగదారులు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

PIN నమోదు చేయకుండా Paytm ద్వారా చెల్లింపులు.. కొత్త సిస్టమ్‌!
PIN నమోదు చేయకుండా Paytm ద్వారా చెల్లింపులు.. కొత్త సిస్టమ్‌!
ఢాకాలో ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ ప్రభు అరెస్ట్‌ హిందువుల్లో ఆగ్రహం
ఢాకాలో ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ ప్రభు అరెస్ట్‌ హిందువుల్లో ఆగ్రహం
హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి