Astro News: దేవుడి ఎదుట పిండితో చేసిన దీపం వెలిగించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

దీపాన్ని జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు. ప్రజలు ఇళ్లలో రాగి, ఇత్తడి, మట్టితో చేసిన ప్రమిదల ద్వారా దీపాలను వెలిగించి దేవుడిని ఆరాధిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో పిండి దీపాలు వెలిగిస్తారు. దీని వెనుక ప్రత్యేక కారణం ఉంది.

Astro News: దేవుడి ఎదుట పిండితో చేసిన దీపం వెలిగించడం వల్ల  ఏం జరుగుతుందో తెలుసా..?
Pindi Deepam
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 11, 2022 | 8:21 AM

సనాతన ధర్మంలో దీపం వెలిగించకుండా పూజ- హారతి పూర్తి కాదంటారు. ప్రతి శుభ సందర్భంలో కూడా దీపాలు వెలిగిస్తారు. ప్రత్యేక సందర్భాలలో నాలుగు దీపాలు లేదా ఐదు ముఖాల దీపాలు కూడా వెలిగిస్తారు. ఇదీ కాకుండా, ప్రత్యేక వత్తి, ఆవాల నూనె మొదలైనవి కూడా దీపంలో ఉపయోగిస్తారు. ఇందుకు మట్టితో పాటు ఇత్తడి దీపం, పిండి దీపం కూడా వినియోగిస్తారు. ప్రతిరోజూ ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా ఆనందం, శ్రేయస్సు వెళ్లివిరుస్తాయని నమ్ముతారు. అగ్నిదేవుని సాక్షిగా ఏ పని చేసినా సక్సెస్‌ అవుతుందని చెబుతారు. శరీరం సృష్టికి కారణమైన ఐదు మూలకాలలో అగ్ని కూడా ఒకటి. దీపాన్ని జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు. ప్రజలు ఇళ్లలో రాగి, ఇత్తడి, మట్టితో చేసిన ప్రమిదల ద్వారా దీపాలను వెలిగించి దేవుడిని ఆరాధిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో పిండి దీపాలు వెలిగిస్తారు. దీని వెనుక ప్రత్యేక కారణం ఉంది. జ్యోతిషశాస్త్రంలో పిండి దీపం చాలా శక్తివంతమైనదిగా వర్ణించబడింది. ఇది జీవితంలోని అతి పెద్ద సమస్యలను కూడా అధిగమించగలదు. పిండి దీపం వెలిగించడం మిమ్మల్ని ధనవంతులుగా మార్చే మార్గాల్లో ఒకటి. పిండి దీపం వెలిగించే సరైన మార్గాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

ప్రత్యేక పరిస్థితుల్లో పిండి దీపాలు వెలిగిస్తారు. సాధారణంగా కోరికలు తీర్చుకోవటం కోసం పిండి దీపాలు వెలిగిస్తారు. దీని కోసం ఎల్లప్పుడూ పిండి దీపాల సంఖ్యను తగ్గించడం, పెంచడం చేస్తుంటారు. ఉదాహరణకు 11 రోజులు దీపాలు వెలిగిస్తే మొదటి రోజు 11 దీపాలు, రెండవ రోజు 10 దీపాలు, చివరి రోజు 1 దీపం మాత్రమే వెలిగించాలి. మీరు 1 దీపంతో వెలిగించడం ప్రారంభించినట్లయితే చివరి రోజున 11 దీపాలను వెలిగించండి. ఇది కాకుండా మీ కోరిక ప్రకారం ఇష్ట దైవం ముందు దీపం వెలిగించండి.

ఆర్థిక సంక్షోభం నుండి విముక్తి పొందాలనుకునే వారు, సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవి ముందు తీర్మానం చేసి, 11 రోజుల పాటు పెరుగుతున్న లేదా తగ్గుతున్న క్రమంలో పిండి దీపాలను వెలిగించండి. దీని కారణంగా, కొన్ని రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితిలో అద్భుతమైన మెరుగుదల ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పిండిలో పసుపు కలిపి దీపం చేసి, ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే, విష్ణువు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దురదృష్టం అదృష్టంగా మారుతుంది. ఒక వ్యక్తి జీవితంలో అపారమైన ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. దీనితో పాటు ప్రతి పనిలో విజయం ప్రారంభమవుతుంది.

మీరు అప్పుల బాధతో బాధపడుతుంటే, బజరంగ్ బలి ముందు పిండి దీపం వెలిగించండి. దీంతో ఆస్తి సంబంధిత సమస్యలు కూడా పరిష్కారం కానున్నాయి. పదే పదే ధన నష్టం వస్తే శనిదేవుని ముందు పిండి దీపం వెలిగించండి. అన్ని అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

అన్నపూర్ణ దేవి ముందు పిండి దీపాలు వెలిగించడం వల్ల ఇల్లు సిరిసంపదలతో నిండిపోతుంది. జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోవాలంటే పూజగదిలో పిండి దీపం వెలిగించాలి. శనివారం రోజు ఆవనూనెతో దీపం వెలిగిస్తే శనిగ్రహదోషాలు తొలగిపోతాయి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిష్యంపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని గమనించి ఈ ఆర్టికల్ రాయడం జరిగిందని గుర్తించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..