Chanakya Niti: మన జీవితంలో అసలు శత్రువులు ఇవే.. ఇవి మనపై ఎప్పుడైనా దాడి చేయవచ్చు.. వాటిని తక్కువగా అంచనా వేయకండి..
చరిత్రలో అత్యంత తెలివైన రాజనీతిజ్ఞుడు, విచక్షణతో అర్ధశాస్త్రాన్ని, మానసిక శాస్త్రాన్ని అవుపోసన పట్టిన గొప్ప పండితుడైన చాణక్యుడు చెప్పిన మనలోని శత్రువు గురించి తెలుసుకుందాం..
చాణక్యుడు భారతీయ చరిత్రలో గొప్ప ఆలోచనాపరులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. రాజకీయ ఆలోచనలకు ప్రసిద్ది చెందాడు చాణక్యుడు. అయితే అతని ఆలోచనలు రాజకీయాల కంటే అతీతంగా ఉంటాయి. శతాబ్దాలు గడిచినా ఆయన ఆలోచనలపై ప్రజల్లో ఆసక్తి నెలకొనడానికి ఇదే కారణం. అతని బోధనలతో తమ జీవితంలోని కష్టాలకు పరిష్కారాలను కనుగొంటారు. విజయవంతమైన, సురక్షితమైన జీవితం కోసం, మనం ఎల్లప్పుడూ కొన్ని విషయాల నుంచి కొంతమంది వ్యక్తుల నుంచి దూరం ఉంచడం చాలా అవసరం. వారి దగ్గరికి వెళ్లడం అంటే విధ్వంసం అని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. చాణక్యుడు చెప్పినట్లుగా, వ్యాధి, పాము, శత్రువు బలహీనంగా భావించరాదు. ఈ మూడింటిని మీ జీవితానికి దూరంగా ఉంచడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. చాణక్యుడు ఈ మూడింటిని ఎందుకు అంత ప్రమాదకరమైనవిగా భావించాడో తెలుసుకుందాం..
శత్రువును తక్కువ అంచనా వేయకండి..
చాణక్యుడు ఎప్పుడూ శత్రువు గురించి జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తాడు. శత్రువుని ఎప్పుడూ తక్కువవాడిగా పరిగణించవద్దు. శత్రువు ప్రశాంతంగా ఉంటే ఓడిపోయాడని అర్థం కాదని అంటాడు. శత్రువును జయించాలంటే అతని బలం, బలహీనత, అలవాట్ల గురించి సమాచారాన్ని పొందాలి. అతను మీ నుంచి దూరంగా ఉన్నప్పుడు శత్రువుపై ప్రత్యేక శ్రద్ధతో ఉండాలి. బహుశా అతను మీకు హాని చేయాలని ఆలోచిస్తున్నాడని అర్థం చేసుకోవాలి.
కనిపించని శత్రువు
చాణక్యుడు చెప్పినట్లుగా, వ్యాధి కనిపించని శత్రువు. మీరు ఎంత దృఢంగా.. విజయవంతంగా ఉన్నా.. మీ శరీరం అనుభవించే వ్యాధి మీ ఆనందాన్ని మొత్తం లాగేస్తుంది. లేదా మీరు ఏదైనా పెద్ద లక్ష్యం కోసం కష్టపడుతున్నట్లయితే.. ఆ వ్యాధి మీ అతిపెద్ద శత్రువుగా మారుతుంది. వ్యాధి సోకిన వెంటనే వెంటనే చికిత్స చేయించుకోవడం ఉత్తమం. వ్యాధి ప్రారంభ లక్షణాలను తెలుసుకొని వైద్యుడిని సంప్రదించండి.
దాడి ఎప్పుడు చేస్తుందో చెప్పలేం..
పాములకు ఎప్పుడూ దూరంగా ఉండండి . పాము ఎప్పుడు బయటకు వచ్చి మీపై దాడి చేస్తుందో చెప్పలేం. పాముని ఎప్పుడూ ఇబ్బంది పెట్టవద్దు. జీవితంలో ఎప్పుడూ పాములను కలవకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం