Zomato CEO: సాధారణ డెలివరీ బాయ్‌లా జొమాటో సీఈఓ.. మూడేళ్లుగా చేస్తున్నా ఎవరూ గుర్తుపట్టని వైనం..
అతనో కంపెనీకి సీఈవో. సాధారణ డెలివరీ బాయ్‌లా మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. ఈ విషయం ఆ కంపెనీలో పనిచేసేవారికెవ్వరికీ తెలియదు.
అతనో కంపెనీకి సీఈవో. సాధారణ డెలివరీ బాయ్‌లా మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. ఈ విషయం ఆ కంపెనీలో పనిచేసేవారికెవ్వరికీ తెలియదు. ఇంతకీ ఎవరాయన? ఎందుకలా పని చేశారు? ఆసక్తికర వివరాలు ఇప్పడు తెలుసుకుందాం..
కంపెనీ సీఈవో అంటే టిప్‌టాప్‌గా ఆఫీసుకు వస్తారు. పైస్థాయి ఉద్యోగులతో మీటింగ్‌లు నిర్వహిస్తారు. బిజినెస్ డెవలప్‌మెంట్ ప్లాన్స్ అమలు చేసి, కంపెనీ అభివృద్ధి, విస్తరణకు దోహదపడతారు. సాధారణంగా ఓ కంపెనీ సీఈవో డైలీ రొటీన్ వర్క్ ఇలానే ఉంటుంది. కానీ ఇందుకు భిన్నంగా జొమాటో సీఈవో, ఆ కంపెనీ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ మరోలా ఆలోచించారు. తన కంపెనీలో సాధారణ డెలివరీ బాయ్‌లా రెడ్ టీ షర్ట్ ధరించి, బైక్ మీద ఫుడ్ డెలివరీలు చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి కాదు ..ప్రతి మూడు నెలలకోసారి, గత మూడేళ్లలో ఆయన ఇదే పనిచేస్తున్నారట. ఈ విషయాన్ని నౌకరీ.కామ్ యాజమాని సంజీవ బిక్‌చందానీ బయటపెట్టారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
దీపిందర్ గోయల్ ఒక్కరే కాదు..ఆ కంపెనీలో పనిచేసే సీనియర్ మేనేజర్లందరూ ఇదే తరహాలో ప్రతి మూడు నెలలకోసారి డెలివరీ బాయ్ అవతారం ఎత్తుతుంటారని సంజీవ్ తెలిపారు. రోజంతా ఫుడ్ డెలివరీలు చేస్తుంటారని చెప్పారు. గడిచిన మూడేళ్లుగా దీపిందర్ ఇదే పనిచేస్తున్నారని వివరించారు. అయినా ఇప్పటివరకు తనను ఎవరూ గుర్తు పట్టలేదని దీపిందర్ తనతో చెప్పినట్లు సంజీవ్ తెలిపారు. సంజీవ్ ట్వీట్ చూసిన నెటిజన్లు జొమాటో సీఈఓపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ ఫుడ్‌ను ఆయన డెలివరీ చేస్తే చూడాలని ఆసక్తిగా ఉందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. దీనివల్ల వినియోగదారుల అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు.. క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల కష్టాలను అర్థం చేసుకోవడానికి వీలు పడుతుందని ఓ వ్యక్తి కామెంట్ రూపంలో తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..