Beauty Tips: తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి డై అవసరం లేదు.. ఈ ఒక్క మొక్క అద్భుతాలు చేస్తుంది..
జుట్టును నల్లగా మార్చడానికి రంగులు వేస్తారు. దీని కారణంగా జుట్టు ఎక్కువగా వెలుసుగా మారుతుంది. ఈ రంగులు వేయడం వల్ల అనేక దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అయితే రంగులు వేయకుండానే నల్లగా మార్చుకునే అవకాశం ఉంది. ఎలా అంటే..
మన ఆరోగ్యం పూర్తిగా మన ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో ప్రజలు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు .. ఎందుకంటే వారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని బోరింగ్‌గా ఫీలవుతున్నారు. అందుకే ఆ జంక్ ఫుడ్ ప్రభావం ఆరోగ్యంపై పడుతోంది. దీని ప్రభావం ముందు జుట్టుపై కనిపిస్తోంది. జుట్టు రాలడంతోపాటు ఇలాంటి చాలా సమస్యలు వస్తున్నాయి. 50 ఏళ్లు రాకముందే జుట్టు తెల్లబడుతోంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తెల్లగా మారిన జుట్టుకు నల్లని రంగు వేస్తున్నారు. ఈ డై ఉపయోగించడం వల్ల జుట్టు మరింత అనారోగ్యంగా మారుతోంది. జుట్టు నిర్జీవంగా మారడంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా తొంగి చూస్తున్నాయి. అయితే ఇలా తెల్లని జుట్టును ఎలాంటి రంగులు ఉపయోగించకుండానే నల్లగా మార్చుకునే చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పడు తెలుసుకుందాం..
ఇందులో చాలా ముఖ్యమైనది కరివేపాకు. కరివేపాకు ఉపయోగించండం ద్వారా జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు నెరసిపోకుండా కరివేపాకు సహాయం చేస్తుంది. జుట్టులో మెలనిన్ లేకపోవడం వల్ల అవి తెల్లగా మారుతాయి. కరివేపాకు జుట్టులోని మెలనిన్ లోపాన్ని తొలగిస్తుంది. కరివేపాకును ఉపయోగించడం వల్ల జుట్టు మెరుస్తూ మృదువుగా మారుతుంది.
కరివేపాకుతో హెయిర్..
కరివేపాకు మాస్క్ చేయడానికి.. మీకు కరివేపాకు, కొబ్బరి నూనె, వేప ఆకులు, విటమిన్ ఇ క్యాప్సూల్స్,పెరుగు అవసరం. మాస్క్ చేయడానికి.. కరివేపాకు, వేప ఆకులను మిక్సీలో మెత్తగా రుబ్బి.. ఆపై దానిని ఒక గిన్నెలో తీసి ఉంచండి. తర్వాత మరో పాత్రలో కొబ్బరినూనె, విటమిన్ ఇ క్యాప్సూల్, పెరుగు వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా చిన్నని మంటపై వేడి చేయండి. చల్లారిన తర్వాత అందులో కరివేపాకు, వేప ఆకుల మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. మీ హెయిర్ మాస్క్ సిద్ధంగా ఉంది.
ఈ విధంగా..
రెడీ చేసిన కరివేపాకు మిశ్రమాన్ని జుట్టులో హెయిర్ మాస్క్‌ను వర్తించే ముందు.. జుట్టును సరిగ్గా కడిగి.. ఆరబెట్టండి. తడి లేనటువంటి జుట్టుకు కరివేపాకు హెయిర్ మాస్క్‌ని పట్టించండి. ఒక గంట తర్వాత జుట్టును కడగాలి. ఈ హోం రెమెడీని వారానికి రెండు సార్లు అప్లై చేయండి. మీరు ఖచ్చితంగా ప్రభావం చూస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం