Hyaluronic Acid: ముఖంపై ముడతలతో సతమతమవుతున్నారా.? అకాల వృధ్యాప్యానికి ఈ సౌందర్య ఔషధంతో చెక్.!
చర్మ సంరక్షణ కోసం అనేక వంటింటి చిట్కాలు, ఇతర ఉత్పత్తులు ఉన్నాయి. వీటిలో ఒకటి హైలురానిక్ యాసిడ్.. ఇది నేడు ఉత్తమ చర్మ సంరక్షణ పద్ధతుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.
మారుతున్న కాలంతో పాటు తినే ఆహారం, తగినంత నిద్ర లేకపోవడం, వ్యాయామం వంటి దినచర్య లేకపోవడం వంటి కొన్ని అలవాట్లు శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు అకాల వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు వంటివి రావడం ప్రారంభిస్తాయి. చర్మంపై అకాల మచ్చలు లేదా ముడతలు కనిపించడం ప్రారంభవృద్ధాప్య చర్మ సమస్య. ఇది కాకుండా ఒత్తిడి, బలహీనమైన మానసిక ఆరోగ్యం కూడా చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. చర్మ సంరక్షణ కోసం అనేక వంటింటి చిట్కాలు, ఇతర ఉత్పత్తులు ఉన్నాయి. వీటిలో ఒకటి హైలురానిక్ యాసిడ్.. ఇది నేడు ఉత్తమ చర్మ సంరక్షణ పద్ధతుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది కెమికల్ ఫార్మాట్. ఇది సౌందర్య ఉత్పత్తుల్లో ఒకటిగా ఉపయోగించబడుతుంది. ఈ రోజు హైలురానిక్ యాసిడ్ వలన ఉపయోగం ఏమిటి.. ఏ చర్మ సమస్యల నుండి మీరు దూరం అవ్వవచ్చునో తెలుసుకుందాం..
హైలురానిక్ యాసిడ్ అంటే ఏమిటి? మానవ శరీరంలోని చర్మ కణజాలంలో హైలురానిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఒక రకమైన చక్కెర అణువు.. సహజంగా చర్మంలో ఉంటుంది. చర్మంలో ఇది లోపిస్తే, కొల్లాజెన్ ఉత్పత్తిలో సమస్య ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో, చర్మం పొడిగా, నిర్జీవంగా కనిపించడం ప్రారంభిస్తుంది. చర్మంలో తేమను కోల్పోతుంది. చర్మం మెరుపుని మెరుగుపరచడానికి మచ్చలు, గాయాలు లేదా గీతలు వంటివాటిని నివారించడానికి హైలురానిక్ యాసిడ్ ఫిల్లర్లు లేదా HA ఫిల్లర్‌లను ఉపయోగించవచ్చు.
చర్మ సమస్యలకు హైలురానిక్ తో చెక్:
చిన్న చిన్న మచ్చలు, ముడతలు: చర్మంలో హైలురానిక్ యాసిడ్ స్థిరంగా ఉంటే.. అప్పుడు చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయవద్దు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చర్మంలో హైలురానిక్ యాసిడ్ లోపిస్తే.. చర్మంపై మచ్చలు లేదా ముడతలు కనిపించడం ప్రారంభిస్తాయి.
పొడిబారడం: మీ చర్మం తరచుగా పొడిబారిపోతుంటే చర్మంలో హైలురోనిక్ యాసిడ్ లోపం ఏర్పడి ఉండవచ్చు. దీనిని నివారించడానికి మీరు మార్కెట్లో లభించే క్రీమ్‌లు, సీరమ్‌లు , ఇతర స్కిన్ కేర్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.
చర్మ సంరక్షణ: చర్మ సంరక్షణలో హైలురానిక్ యాసిడ్‌తో తయారైన ఉత్పత్తులకు దుష్ప్రభావాలు ఉండవు అనే అపోహ కూడా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది నేరుగా చర్మానికి హాని కలిగించదు. అయినప్పటికీ, ఇతర పదార్ధాలను కలిగి ఉన్న హైలురోనిక్ యాసిడ్ ఉత్పత్తులు మాత్రం హాని కలిగించవచ్చు. ముఖానికి అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని హెల్త్ కేర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.