AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LED Light Therapy: నేడు వాడుకలో LED లైట్ థెరపీ.. చర్మానికి చికిత్స ఎలా చేస్తారో తెలుసా..

LED పూర్తి పేరు లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్‌ఈడీ లైట్లు చాలా ఏళ్లుగా వాడుకలో ఉన్నాయి. అయితే ఎల్‌ఈడీ లైట్ థెరపీతో స్కిన్ ట్రీట్‌మెంట్ ప్రారంభించి మాత్రం చాలా తక్కువ సమయం మాత్రమే అయింది.

LED Light Therapy: నేడు వాడుకలో LED లైట్ థెరపీ.. చర్మానికి చికిత్స ఎలా చేస్తారో తెలుసా..
Led Light Therapy
Surya Kala
|

Updated on: Oct 10, 2022 | 5:11 PM

Share

చర్మంపై మొటిమలు, వడదెబ్బ వంటి సమస్యలకు ఇప్పుడు LED లైట్ థెరపీని ఉపయోగిస్తున్నారు. ఈ LED లైట్ థెరపీ తీసుకోవాలంటే.. మీరు డెర్మటాలజిస్ట్ సహాయం తీసుకోవచ్చు. డాక్టర్ సలహాపై ఇంట్లో పరికరాన్ని ఉపయోగించవచ్చు. ఈ చికిత్సలో కాంతి వివిధ రకాల వేవ్ లెంగ్త్‌లను ఉపయోగిస్తారు. ఇలా చేయడం వలన చర్మం సహజ వైద్యం ప్రక్రియను ప్రేరేపిస్తుంది. ఈ రోజు మనం ఈ థెరపీ గురించి తెలుసుకుందాం..

LED లైట్ థెరపీ అంటే ఏమిటి? LED పూర్తి పేరు లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్‌ఈడీ లైట్లు చాలా ఏళ్లుగా వాడుకలో ఉన్నాయి. అయితే ఎల్‌ఈడీ లైట్ థెరపీతో స్కిన్ ట్రీట్‌మెంట్ ప్రారంభించి మాత్రం చాలా తక్కువ సమయం మాత్రమే అయింది. గాయాలను నయం చేయడం, కణజాల పెరుగుదలను పెంచడంలో LED లైట్లు సహాయపడతాయి. LED లైట్లలో ఉండే తరంగ దైర్ఘ్యాలు వివిధ లోతుల నుండి చర్మంలోకి చొచ్చుకుపోతాయి. ఇవి నీలం, ఎరుపు కాంతిని కలిగి ఉంటాయి.

చికిత్స ఏ విధంగా చేయాలంటే:  చర్మం కోసం LED లైట్ థెరపీని ప్రొఫెషనల్ లేదా ఇంటిలో ఉపయోగించే పరికరాన్ని ఉపయోగించే చేసుకోవచ్చు. ప్రతి సెషన్ సుమారు 20 నిమిషాల పాటు కొనసాగుతుంది. గరిష్టంగా 10 సెషన్‌లు అవసరమవుతాయి. అయితే ఇంట్లో చేసుకునే గృహ పరికరాన్ని ఉపయోగిస్తున్నట్లు అయితే.. వాటి తయారీదారు సూచనలను అనుసరించడం ముఖ్యం. ఒక వ్యక్తి ముఖంపై LED లైట్ థెరపీ ఉపయోగిస్తారు. ముఖం, చేతులు, మెడ కోసం LED లైట్ థెరపీని ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

LED లైట్ థెరపీ సురక్షితమేనా? LED లైట్ థెరపీ సురక్షితమని మీరు ఆలోచిస్తున్నారా? కాబట్టి ఎల్‌ఈడీ లైట్ థెరపీ చర్మానికి సురక్షితం అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ LED లైటింగ్ పరికరాల దీర్ఘకాలిక ప్రభావాలు తెలియాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొంతమందిలో కొన్ని సార్లు.. మంట, దద్దుర్లు, చర్మం ఎర్రబడటం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Note: ఈ వ్యాసంలో పేర్కొన్న చిట్కాలు, సూచనలు సాధారణ సమాచార ప్రయోజనం కోసం మాత్రమే..  వృత్తిపరమైన వైద్య సలహాగా తీసుకోకూడదు. ఏదైనా ఫిట్‌నెస్ విధానాన్ని  ప్రారంభించే ముందు వైద్య సలహాను  తీసుకోవాలి.