AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oily Skin Care: ఆయిల్ స్కిన్ తో ఇబ్బంది పడుతున్నారా.. బెస్ట్ టిప్స్ మీ కోసం.. రాత్రివేళలో పాటించి చూడండి..

రోజు నిద్రపోయే ముందు తప్పనిసరిగా అనుసరించాల్సిన కొన్ని పద్ధతుల గురించి ఈరోజు తెలుసుకుందాం..  ఈ పద్ధతులు లేదా చిట్కాలు చాలా ప్రభావవంతంగా  పనిచేస్తాయి. ఆయిల్ చర్మంపై ఉపయోగించడం వలన కలిగే రిజల్ట్ వెంటనే తెలుస్తుంది.. 

Oily Skin Care: ఆయిల్ స్కిన్ తో ఇబ్బంది పడుతున్నారా.. బెస్ట్ టిప్స్ మీ కోసం.. రాత్రివేళలో పాటించి చూడండి..
Oily Skin Care Tips
Surya Kala
|

Updated on: Oct 06, 2022 | 10:46 AM

Share

చర్మంలో సెబమ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. ఇలా ఆయిల్ స్కిన్ ఏర్పడటం సహజమైన ప్రక్రియ.. అయితే అధికంగా నూనె రిలీజ్ అయితే అప్పుడు మొటిమల సమస్య అధికంగా ఉంటుంది. కనుక జిడ్డు చర్మం గలవారు ఇతరుల కంటే తమకు తాము ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి. Stylecrase.com లో ప్రచురించబడిన ఒక వార్త ప్రకారం.. జిడ్డుగల చర్మం ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, వారి చర్మంపై మృతకణాలు పేరుకుపోతాయని..  నల్ల మచ్చలు లేదా డెడ్ స్కిన్ సమస్య ఏర్పడుతుందని చెప్పారు. ఆయిల్ స్కిన్ ఉన్నవారు   పగలు మాత్రమే కాదు.. రాత్రి సమయంలో కూడా స్కిన్ కేర్ ను తీసుకోవాలి.

రోజు నిద్రపోయే ముందు తప్పనిసరిగా అనుసరించాల్సిన కొన్ని పద్ధతుల గురించి ఈరోజు తెలుసుకుందాం..  ఈ పద్ధతులు లేదా చిట్కాలు చాలా ప్రభావవంతంగా  పనిచేస్తాయి. ఆయిల్ చర్మంపై ఉపయోగించడం వలన కలిగే రిజల్ట్ వెంటనే తెలుస్తుంది..

క్లెన్సర్‌తో శుభ్రం  రాత్రి పడుకునే ముందు.. మీ జిడ్డు చర్మాన్ని క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోండి. దుమ్ము, ధూళి, తేమ కారణంగా.. చర్మం జిడ్డుగా మారుతుంది. చర్మాన్ని  శుభ్రం చేసుకోకపోతే.. మొటిమలు ఏర్పడతాయి. ఈ ఆయిల్ స్కిన్ ఉన్నవారు చర్మం పై రంధ్రాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రంధ్రాలను శుభ్రంగా ఉంటే స్కిన్ పై ఏర్పడే ఆయిల్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు ముల్తానా మట్టి వంటి వాటిని లేదా క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఫేస్ మాస్క్ ఉత్తమం  జిడ్డు చర్మం ఉన్నవారు వారానికి ఒకసారి రాత్రి పూట ముల్తానీ మిట్టిని ముఖానికి మాస్క్ వేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ చర్మాన్ని లోపల నుండి శుభ్రపరుస్తుంది.అలాగే మృత చర్మ కణాలను తొలగిస్తుంది. రాత్రిపూట ఫేస్ మాస్క్ వేసుకుని తగినంత విశ్రాంతి తీసుకోవడం వలన ఉదయం చర్మం తాజాగా కనిపిస్తుంది. ఆయిల్ స్కిన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసి సహజమైన ఫేస్ మాస్క్‌లతో పాటు.. మార్కెట్లో దొరికే సహజమైన వాటిని ఫేస్ మాస్క్ గా ప్రయత్నించవచ్చు.

నాన్ ఆల్కహాల్ టోనర్ చర్మం జిడ్డుగా ఉన్నప్పటికీ.. ముఖానికి తగిన టోనర్ రాయడం అవసరం. చర్మాన్ని బట్టి టోనర్‌ని కూడా ఎంచుకోవాలి.  ఆయిల్ స్కిన్ గలవారు  ఆల్కహాల్ ఫ్రీ టోనర్‌ని ఉపయోగించండి. ఎందుకంటే ఇది pH స్థాయిని  నియంత్రిస్తుంది. pH స్థాయి బ్యాలెన్స్‌లో ఉంటే చమురు ఉత్పత్తి ఎక్కువగా ఉండదు.

మరిన్ని లైఫ్ స్టైల్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో