Hair Care Tips: 20 ఏళ్లలోనే జట్టు తెల్లబడుతుందా.. సహజమైన ఈ తొమ్మిది చిట్కాలు.. బెస్ట్ రెమెడీస్
అకాల జుట్టు నెరిసిపోవడం ఆత్మగౌరవం తగ్గడానికి ఒక ముఖ్యమైన కారణం. ఇది కాలక్రమంలో వృద్ధాప్యం, ఆక్సీకరణ ఒత్తిడి, యాంటీ ఆక్సిడెంట్ తీసుకోవడం, జన్యుశాస్త్రం, ఆహారం, జీవనశైలిలతో పాటు ఒత్తిడికి గురికావడం లేదా ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి కారణాలతో వ్యక్తులలో వివిధ స్థాయిలలో జుట్టు తెల్లబడుతుంది.
Grey Hair Care Tips: వయసుతో పాటు శారీరకంగా కొన్ని మార్పులు ఏర్పడడం ప్రకృతి నియమం. చర్మం ముడుతలు, జట్టు తెల్లబడడం, పళ్లు ఊడిపోవడం వంటివి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరిలోనూ చోటు చేసుకుంటాయి. అయితే మారుతున్న కాలంతో పాటు.. మనిషి జీవన విధానంతో పాటు, తినే తిండిలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో శరీరంలో అకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 20 ఏళ్ళల్లోనే జుట్టు పలచబడడం, జుట్టు బూడిద రంగు, లేదా తెల్లగా అవుతున్నాయి. అయితే ప్రస్తుతం యువతకు ఎక్కువ మందిలో జుట్టు రంగులో మార్పు కనిపిస్తోంది. దీనికి కారణం.. వాతావరణ మార్పులతో పాటు.. విటమిన్ బి-12 లోపం, ఒత్తిడి, ధూమపానం వంటి ఇతర కారణాలు కూడా జుట్టు తెల్లబడడానికి కారణం అని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
పోషకాహార నిపుణులు అంజలి ముఖర్జీ ప్రకారం.. “అకాల జుట్టు నెరిసిపోవడం ఆత్మగౌరవం తగ్గడానికి ఒక ముఖ్యమైన కారణం. ఇది కాలక్రమంలో వృద్ధాప్యం, ఆక్సీకరణ ఒత్తిడి, యాంటీ ఆక్సిడెంట్ తీసుకోవడం, జన్యుశాస్త్రం, ఆహారం, జీవనశైలిలతో పాటు ఒత్తిడికి గురికావడం లేదా ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి కారణాలతో వ్యక్తులలో వివిధ స్థాయిలలో జుట్టు తెల్లబడుతుంది.
అకాలంగా జుట్టు తెల్లబడకుండా ఈ చిట్కాలను పాటించి చూడండి:
- తగినంత యాంటీఆక్సిడెంట్లు తీసుకోండి. తినే ఆహారంలో కూరగాయలు, పండ్ల రసాల వంటి సహజ ఆహారపదార్ధాలను చేర్చుకోండి. సింథటిక్ రూపంలో సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా అకాలంగా జుట్టు తెల్లబడడం నివారించుకోవచ్చు.
- తినే ఆహారంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. ఇది మీ జుట్టుకు సహజమైన షైన్, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
- తల చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, నారింజ, పసుపు పండ్లు ,కూరగాయలను చేర్చుకోండి.
- తినే ఆహారంలో ఎక్కువ ఖనిజాలను చేర్చుకోండి. జింక్, ఐరన్ , కాపర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
- కృత్రిమ రంగులున్న ఆహారానికి దూరంగా ఉండండి. అవి మీ జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తాయి.
- వాణిజ్యపరంగా ప్రాసెస్ చేయబడిన హెయిర్ డైని నివారించండి. కొన్ని సహజ పోషణలున్న ఆహారపదార్ధాలను జుట్టుకి సంరక్షణంగా ఉపయోగించండి.
- సోడియం లారిల్ సల్ఫేట్ వంటి కఠినమైన డిటర్జెంట్లు లేకుండా సున్నితమైన ఉత్పత్తులను ఉపయోగించండి.
- మీ చేతివేళ్లతో మీ జుట్టుకు మసాజ్ చేయండి. ఇది తలలో రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల హెయిర్ ఫోలికల్స్‌కి సరైన రక్త ప్రసరణ జరుగుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జుట్టు నిర్వహణ జుట్టు పెరుగుదలకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే..కృతిమ పద్దతులు హానికరంగా మారవచ్చు. సహజ చికిత్సలను క్రమం తప్పకుండా ఉపయోగించడం వలన అకాల వృద్ధాప్య ప్రక్రియ, జుట్టు తెల్లబడడం ఆలస్యం అవుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)