International Chocolate Day: మేరీ గోల్డ్ బిస్కెట్స్ , చాక్లెట్స్ తో రుచికరమైన లడ్డులను తయారు చేసుకోండి ఇలా..

మీరు చాక్లెట్ లను ఉపయోగించి టేస్టీ టేస్టీ లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు . ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లోనే మీరు చాక్లెట్ , మేరీ గోల్డ్ బిస్కెట్స్ తో రుచికరమైన లడ్డూలను ఎలా తయారు చేయవచ్చో ఈరోజు  తెలుసుకుందాం.

International Chocolate Day: మేరీ గోల్డ్ బిస్కెట్స్ , చాక్లెట్స్ తో రుచికరమైన లడ్డులను తయారు చేసుకోండి ఇలా..
Chocolate Ladoos
Follow us
Surya Kala

|

Updated on: Sep 13, 2022 | 2:53 PM

International Chocolate Day:  అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని ప్రతి ఏడాది సెప్టెంబర్ 13న కూడా జరుపుకుంటారు, వాస్తవానికి చాక్లెట్ డే సంవత్సరానికి 3 సార్లు జరుపుకుంటారు. మొదటి సారి ఫిబ్రవరి 9న, రెండవ సారి జూలై 7న.. మూడవ సారి ఈరోజు అంటే సెప్టెంబర్ 13న జరుపుకుంటారు. పెద్దలైనా, పిల్లలైనా చాక్లెట్‌ ప్రియులే.. వయసుతో సంబంధం లేకుండా చాక్లెట్‌ అందరూ ఇష్టంగా తింటారు. చాక్లెట్ కేక్ , చాక్లెట్ ఐస్ క్రీం వంటి  అనేక రకాల డెజర్ట్‌లను తయారు చేయడానికి కూడా చాక్లెట్ ఉపయోగించబడుతుంది. మీరు చాక్లెట్ లను ఉపయోగించి టేస్టీ టేస్టీ లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు . ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లోనే మీరు చాక్లెట్ , మేరీ గోల్డ్ బిస్కెట్స్ తో రుచికరమైన లడ్డూలను ఎలా తయారు చేయవచ్చో ఈరోజు  తెలుసుకుందాం.

చాక్లెట్ లడ్డు తయారీకోసం కావలసిన పదార్ధాలు: 

మేరీ గోల్డ్ బిస్కెట్ -18 నుండి 20

ఇవి కూడా చదవండి

చాక్లెట్ సాస్- 3 టేబుల్ స్పూన్లు

కోకో పౌడర్- 1 టేబుల్ స్పూన్

చక్కెర- 2 స్పూన్

వెన్న- 5 స్పూన్

వెనీలా- ఎసెన్స్ కొన్ని చుక్కలు

చాక్లెట్ లడ్డును దశలవారీగా తయారీ విధానం:

ఈ డెజర్ట్ చేయడానికి, ముందుగా బిస్కెట్స్ ను పొడిగా చేసుకోవాలి.

దశ – 2 ఒక గిన్నెలో వెన్న, కోకో పౌడర్, చాక్లెట్ సాస్ ,చక్కెర లను తీసుకోవాలి

దశ – 3 వీటన్నిటిని బాగా కలపండి. ఒక మృదువైన క్రీమ్ ఏర్పడే విధంగా ఈ వస్తువులన్నింటినీ మిక్స్ చేయాలి.

దశ – 4 ఇప్పుడు ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల వెనీలా ఎసెన్స్ జత చేసి.. దానిలో ముందుగా తయారు చేసుకున్న బిస్కెట్ పౌడర్ ను జతచేసుకోండి.

దశ – 5 వీటన్నింటిని మిక్స్ చేసి పిండిలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి నుండి చిన్న చిన్న లడ్డూలను సిద్ధం చేసుకోండి.

దశ – 6 ఇప్పుడు ఈ లడ్డూలను చాక్లెట్ ట్రేలో ఉంచండి. ఈ ట్రేని 1 గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచండి.

దశ – 7 ఇప్పుడే ఈ లడ్డూలను సర్వ్ చేయండి. ఈ లడ్డూలను పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు.

చాక్లెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

చాక్లెట్ ఒత్తిడి తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్‌ను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. కోకోలో క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందకుండా నిరోధించే పదార్థాలు ఉన్నాయి. చాక్లెట్స్ మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చాక్లెట్తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మం ముడతల సమస్యను దూరం చేస్తుంది. అయితే పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. చాక్లెట్స్ ను   అధికంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..