- Telugu News Photo Gallery India tour and travel: best tourist hill station in india you should visit
India Travel: భారతదేశంలో ఈ పర్యాటక ప్రదేశాలు స్విట్జర్లాండ్‌ను మించి అందాలు సొంతం.. ఒక్కసారి సందర్శిస్తే చాలు వావ్ అంటారు..
ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న అందమైన ప్రదేశాల గురించి మీరు వినే ఉంటారు. మీరు కూడా వీటిలో చాలా ప్రదేశాలను సందర్శించాలని ఆసక్తిని చూపిస్తారు. భారతదేశంలో అలాంటి అందమైన ప్రదేశాలకు కొరత లేదు.
Updated on: Sep 10, 2022 | 4:12 PM

ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో ఏదో ఒక హిల్ స్టేషన్‌కి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది భారతదేశంలోనే హిల్ స్టేషన్‌ని సందర్సించి ఆనందిస్తారు. మరి కొంతమంది విదేశాలకు వెళతారు. ఈ రోజు మనం భారతదేశంలోని అలాంటి కొన్ని హిల్ స్టేషన్ల గురించి తెలుసుకుందాం.. అవి స్విట్జర్లాండ్ అందాలకు ఏ మాత్రం తీసిపోవు

కాశ్మీర్ అందాన్ని భూతాల స్వర్గంతో పోలుస్తారు. మంచుతో కప్పబడిన అందమైన పర్వతాలు.. నీటితో కూడిన అందమైన సరస్సు, చుట్టూ తులిప్‌ల తోటలు, అటువంటి దృశ్యాలు స్వర్గంలా తలపిస్తాయి. అందుకనే కాశ్మీర్‌ను భూమిపై స్వర్గం అని కూడా అంటారు.

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండల రాణిగా ప్రసిద్ధి చెందింది. డార్జిలింగ్‌లోని తేయాకు తోటల కారణంగా, ఇక్కడి దృశ్యం ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా, అందంగా ఉంటుంది. మీరు ఇక్కడ వర్షాన్ని కూడా ఆస్వాదించవచ్చు.

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి ఒక పెద్ద పర్యాటక ప్రదేశం. వేసవి రోజుల్లో ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ దృశ్యం కళ్లలో కాదు హృదయంలో పదిలంగా ఉంటుంది. మనాలిలో రాఫ్టింగ్ ను ఆనందించవచ్చు.

దేశంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో లేహ్ ఒకటి. లేహ్ వాతావరణం ప్రశాంతంగా, సుందరంగా ఉంటుంది, ఇక్కడి ప్రశాంతత అందరి మనసులను దోచుకుంటుంది. ఇక్కడ రోమింగ్ కాకుండా, మీరు అనేక సాహసోపేతమైన కార్యకలాపాలను ముఖ్యంగా మౌంటెన్ బైకింగ్‌ను ఆస్వాదించవచ్చు.




