Egg Paratha Recipe: సండే స్పెషల్.. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే ఎగ్ మసాలా పరాటా రెసిపీ.. మీకోసం

కోడి గుడ్లతో ఈజీగా టేస్టీగా మసాలా ఎగ్ పరాటాలు తయారు చేసుకోవచ్చు. వీటిని పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈరోజు మనం కోడిగుడ్ల‌తో రుచికరమైన ఎగ్ మసాలా పరాటాల తయారీ గురించి తెలుసుకుందాం

Egg Paratha Recipe: సండే స్పెషల్.. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే ఎగ్ మసాలా పరాటా రెసిపీ.. మీకోసం
Egg Masala Paratha
Follow us
Surya Kala

|

Updated on: Sep 11, 2022 | 11:32 AM

Egg Paratha Recipe: కోడిగుడ్డు సంపూర్ణ ఆహారమని అంటారు. ఎందుకంటే.. గుడ్డులోని మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు ఉన్నాయి. అందుకే కోడి గుడ్డు, బాతుగుడ్డు, టర్కీగుడ్డు, గిన్నేకోడి గుడ్లు ఎక్కువగా తీసుకుంటారు. కోడిగుడ్ల‌తో రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. కూర, వేపుడు, అట్టు, స్నాక్స్ ఐటెమ్స్ ఇలా రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. అయితే కోడి గుడ్లతో ఈజీగా టేస్టీగా మసాలా ఎగ్ పరాటాలు తయారు చేసుకోవచ్చు. వీటిని పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈరోజు మనం కోడిగుడ్ల‌తో రుచికరమైన ఎగ్ మసాలా పరాటాల తయారీ గురించి తెలుసుకుందాం..

త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

గోధుమ‌పిండి – పావు కిలో, కోడిగుడ్లు- 4 (ఉడ‌క‌బెట్టినవి) మిరియాల పొడి -1 టీస్పూన్, కొత్తిమీర -అర‌ క‌ప్పు(తురుము) నూనె లేదా నెయ్యి- కావాల్సినంత ఉప్పు రుచికి సరిపడా

ఇవి కూడా చదవండి

త‌యారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం ఉప్పు, రెండు స్పూన్ల నెయ్యి, నీరు పోసి చపాతీ ముద్దను తయారు చేసుకోవాలి. ఈ చతపతీ ముద్దను ఒక పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని నీరు పోసి.. దానిలో గుడ్లు,ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న గుడ్లను చల్లటి నీటిలో వేసి.. పెంకులు తీసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. అనంతరం కోడి గుడ్లను సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిమీద మిరియాల పొడి, కట్ చేసుకున్న కొత్తిమీర తురుము, ఉప్పువేసి మిక్స్ చేసుకుని ఒక పక్కకు పెట్టుకోవాలి.

ఇప్పుడు నానబెట్టుకున్న చపాతీ పిండిని తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని వాటిని చపాతీల్లా ఒత్తుకోవాలి. అనంతరం ఆ చపాతీల్లో ముందుగా రెడీ చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని పెట్టి.. చపాతీ అంచులకు కొంచెం తడి చేసి.. కక్లోజ్ చేయాలి. అనంతరం మళ్ళీ దానిని చపాతీలా ఒత్తుకోవాలి.

ఇలా రెడీ చేసిన కున్న తర్వాత గాస్ స్టౌ వెలిగించి బాణలి పెట్టాలి. అది వేడి ఎక్కిన తర్వాత నూనె వేసి.. ఎగ్ మసాలా పెట్టుకున్న చపాతీని పెనం మీద వేసుకుని రెండు వైపులా వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ మసాలా రాటాలు రెడీ. వీటిని నేరుగా తినవచ్చు.. లేదా రైతాతో కూడా తిన్నా రుచిగా బాగుంటాయి. మరి సండే స్నాక్ ఐటెం గా ఒక్కసారి ఎగ్ మసాలా పరాటాలను ట్రై చేసి చూడండి..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..