Thati Rotte: నేటి తరానికి తెలియని.. గోదావరిజిల్లాల స్పెషల్.. అమ్మమ్మ కాలం నాటి తాటిరొట్టె.. తయారీ ఎలా అంటే

తాటి రొట్టె..  గోదారోళ్ళ కేకు.. ఈ వర్షాకాలం సీజన్ లో దొరికే తాటిపండుతో  తాటిరొట్టె, తాటిగారెలు, తాటిఇడ్లి వంటి తయారు చేసుకుంటారు. అయితే వీటిని తయారు చేయడం.. నేటి తరం అమ్మాయిలకి కూడా తెలియదంటే అతిశయోక్తికాదు. ఆ మాటకొస్తే మన అమ్మ వాళ్ళకి కూడా చాలా మందికి తాటి పండుతో రొట్టె, గారెలు తయారు చేయడం రాదు..

Thati Rotte: నేటి తరానికి తెలియని.. గోదావరిజిల్లాల స్పెషల్.. అమ్మమ్మ కాలం నాటి తాటిరొట్టె.. తయారీ ఎలా అంటే
Tati Rotte
Follow us
Surya Kala

|

Updated on: Aug 12, 2022 | 7:32 AM

Thati Rotte: ఇప్పుడు పిల్లలలు ఆకలి అంటే.. స్నాక్స్ గా పిజ్ఙాలు, బర్గర్ వంటివి ఆర్డర్ పెట్టుకుని తింటారు.. కానీ నిన్నటి తరం వరకూ ఇంట్లోనే రుచిగా శుచిగా సీజన్ కి అనుగుణంగా ఆహారం తయారు చేసేవారు.. దానిని పిల్లలకు ఆకలి అన్నప్పుడు పెట్టేవారు.. అలాంటి సీజనల్ ఫుడ్ లో ఒకటి తాటిరొట్టె.. ఇది గోదావరి జిల్లా స్పెషల్ ఫుడ్.. ఇంకా చెప్పాలంటే..  తాటి రొట్టె..  గోదారోళ్ళ కేకు.. ఈ వర్షాకాలం సీజన్ లో దొరికే తాటిపండుతో  తాటిరొట్టె, తాటిగారెలు, తాటిఇడ్లి వంటి తయారు చేసుకుంటారు. అయితే వీటిని తయారు చేయడం.. నేటి తరం అమ్మాయిలకి కూడా తెలియదంటే అతిశయోక్తికాదు. ఆ మాటకొస్తే మన అమ్మ వాళ్ళకి కూడా చాలా మందికి తాటి పండుతో రొట్టె, గారెలు తయారు చేయడం రాదు.. ఈ తాటిపళ్లతో రొట్టె చెయ్యాలంటే మన అమ్మమ్మ, నానమ్మ వారికే వస్తుంది.

తాటి రొట్టె తయారీకి కావాల్సిన పదార్ధాలు: 

ఫ్రెష్ గా ఉండే  తాటికాయలు బియ్యం రవ్వ బెల్లం -తీపికి సరిపడా కొబ్బరి కోరు నూనె అరిటాకులు

ఇవి కూడా చదవండి

తయారీ విధానం: తాటికాయలు అవి తెచ్చుకొని శుభ్రంగా కడిగి పైన తొక్క తీసి లోపల వాటిని బాగా మెత్తగా అయ్యేలా చేయాలి. అనంతరం తాటికాయల నుంచి గుజ్జుని  ఒక బేసినిలో వేసుకోవాలి. అనంతరం.. దానిలో బియ్యం రవ్వ వేసుకుని.. . అనంతరం తురిమిన బెల్లం వేసుకుని బాగా కలపాలి.. అనంతరం కొబ్బరి కోరువేసుకోవాలి. ఈ మిశ్రమం రుచి చూసి.. తీపి సరిపోయింది అనుకుంటే.. ఓ పక్కన పెట్టుకోవాలి. అనంతరం కట్టెల పొయ్యి వెలిగించి.. ఇప్పుడు బాణలి పెట్టండి. అనంతరం.. మంట సన్నగా పెట్టి.. బాణలిలో నూనె ఎక్కువ తక్కువ కాకుండా నూనె వేసుకుని.. దానిని బాణలి చుట్టూ.. రాసి.. ఇప్పడు.. తయారు చేసుకున్న తాటిగుజ్జు మిశ్రమాన్ని వేసుకుని.. సమానంగా పరుచుకోవాలి. అంటే దిబ్బరట్టు మాదిరి వేసుకోవాలి. అనంతరం.. ఆ మిశ్రమంపైన ఒక అరిటాకును బోర్లించి.. పొయ్యిలో ఉన్న నిప్పుల్ని అరిటాకుమీద వేసుకుని రొట్టెను కాల్చుకోవాలి. (ఇలా పైన నిప్పులు వేయడం వలన రొట్టె.. పైన కింద సమంగా కాలుతుంది)

తాటిరొట్టె కాలిన మంచి స్మెల్ వచ్చినతరువాత.. నిప్పులు తీసి.. రొట్టెను వేరే ప్లేట్ లోకి తీసుకోండి.. ఇప్పుడు అది చూడడానికి గుండ్రంగా కేకులా ఉంటుంది. తాటిరొట్టె వేసుకోవడం రాకపోతే.. ఇదే పిండితో తాటి ఇడ్లీ, తాటి గారెలను తయారు చేసుకుంటారు.  ఈ రొట్టెను ఒక్కసారి రుచి చూస్తే.. ఆహా ఏమి రుచి అంటారు.. ఎవరైనా మైమరచి.. దీని ముందు ఇప్పుడు దొరుకుతున్న స్నాక్స్ అన్ని వెస్ట్ అంటారు..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?