AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: బరువు తగ్గాలంటే పాలు తాగాలా.. వద్దా.. నిపుణులు ఏమంటున్నారంటే..?

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సన్నగా ఉండాలని కోరుకుంటున్నారు. ఊబకాయాన్ని తగ్గించుకోవడం కోసం కొందరు పాలు తాగడం మానేస్తారు. దీని వల్ల శరీరంలో పోషకాల కొరత ఏర్పడుతుంది. పాలు తాగడం ద్వారా కూడా సులభంగా బరువు తగ్గొచ్చు.

Weight Loss Tips: బరువు తగ్గాలంటే పాలు తాగాలా.. వద్దా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
Almond Milk
Venkata Chari
|

Updated on: Aug 12, 2022 | 7:15 AM

Share

భారతీయ ఆహారంలో పాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. శాఖాహారులకు పాలు చాలా ముఖ్యమైనవి. దాదాపు అన్ని అవసరమైన పోషకాలు పాలలో ఉంటాయి. అయితే, బరువు తగ్గాలనుకునే వారు లేదా డైటింగ్ చేయాలనుకునే వారు ముందుగా పాలను ఆహారంలో నుంచి తొలగించాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే, దీని వల్ల శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. కానీ, పాలు తాగడం ద్వారా కూడా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చని కొందరు అంటుంటారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి పాలను ఆహారంలో చేర్చండి..

పాల ఉత్పత్తులు బరువు తగ్గడానికి సహాయపడతాయని అనేక పరిశోధనలలో వెల్లడైంది. అయితే మీరు తక్కువ కొవ్వు పాలు, దాని నుంచి తయారు చేసిన వాటిని ఉపయోగించాలి. పాల ఉత్పత్తులలో కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ (CLA) ఉంటుంది. ఇది స్థూలకాయాన్ని నిరోధించే ఏజెంట్. దీంతో ఊబకాయం తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

1- పాలు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం. 1 కప్పు పాలలో దాదాపు 8.14 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ప్రొటీన్ డైట్ తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. హార్మోన్లు కూడా అదుపులో ఉంటాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా కూడా పాలు నివారిస్తాయి.

2- పాలలో తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గే సమయంలో దీనిని తీసుకోవచ్చు. మీరు కొవ్వు రహిత పాలు, దాని నుంచి తయారు చేసిన వాటిని తినవచ్చు. ఇలా చేస్తే మీ పొట్ట కూడా నిండుతుంది. ఊబకాయం కూడా తగ్గుతుంది.

3- మీ జీవక్రియను పెంచడంలో పాలు సహాయపడుతుంది. ఇది బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది. పాల ప్రోటీన్ జీవక్రియను మెరుగుపరుస్తుందని అనేక పరిశోధనలలో తేలింది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

4- పాలు పోషకాలతో సమృద్ధిగా పరిగణిస్తుంటారు. విటమిన్ ఏ, డీ, కే, ఈ అనేక ఖనిజాలు ఇందులో ఉన్నాయి. పాలలో ఫాస్పరస్, మెగ్నీషియం, నైట్రోజన్, అయోడిన్, ఇతర పోషకాలు ఉంటాయి. పాలు ప్రోటీన్, లాక్టోస్, విటమిన్ B-2, కాల్షియంకు మంచి మూలం. ఈ అంశాలన్నీ బరువు తగ్గడానికి సహాయపడతాయి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు టీవీ9 తెలుగు నిర్ధారించలేదు. వీటిని సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు నిపుణులను సంప్రదించి, సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది.