Health Tips: ఆరోగ్యానికి మేలు చేసే అరటి పండును అలా తింటే డేంజర్ అంటున్న నిపుణులు..!!
రోజుకో పండు తింటే చాలు అసలు డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం కూడా ఉండదంటారు. పండ్లలోని ఖనిజాలు, విటమిన్లు వంటి పోషక పదార్థాలు శరీరానికి కావాల్సినంతా శక్తిని అందిస్తాయి.. అయితే,..
Five fruit combinations: పండ్లు తినడం మనిషి ఆరోగ్యానికి చాలా మంచిది. వైద్యులు కూడా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ముందుగా తాజా పండ్లు తినమని సలహా ఇస్తారు. రోజుకో పండు తింటే చాలు అసలు డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం కూడా ఉండదంటారు. పండ్లలోని ఖనిజాలు, విటమిన్లు వంటి పోషక పదార్థాలు శరీరానికి కావాల్సినంతా శక్తిని అందిస్తాయి.. అయితే కొన్ని పండ్లను కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు..అందులో ముఖ్యంగా అరటిపండుతో పాటు కొన్ని పండ్లను కలిపి తినకూడదని చెబుతున్నారు. విభిన్న స్వభావాలు కలిగిన పండ్లను కలిపి తింటే మీరు తీవ్రమైన అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా అరటి పండు, బొప్పాయి అస్సలు కలిపి తినకూడదని సూచిస్తున్నారు..దాంతో కలిగే దుష్పప్రభావాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
అరటిపండు తీసుకోవడం వల్ల గుండె రక్తప్రసరణతో పాటు పొట్టకు మేలు చేస్తుంది. బొప్పాయితో జీర్ణక్రియ కూడా బాగుంటుంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రెండు పండ్ల భిన్నమైన స్వభావాలు కలిగి ఉండడం వల్ల ఇలాంటి హానికరమైన ఫ్రూట్ కాంబినేషన్ తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. సాధారణంగా అరటి స్వభావం చల్లగా ఉంటే, బొప్పాయి ప్రభావం వేడిగా ఉంటుంది. వీటిని కలిపి తినడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగకపోవడం, వాంతులు, తలనొప్పి, వికారం, అసెడిటీ, అలర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి.గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదు. ఎందుకంటే దీని ప్రభావం వేడిగా ఉండడం వల్ల కడుపులో పిండాన్ని దెబ్బతీస్తుంది.
అనేక పరిశోధనల ద్వారా ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులు బొప్పాయి తినడం వల్ల ఆ సమస్యలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీంతో పాటు ముఖంపై మొటిమలు, దురద సమస్య ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. కాబట్టి అలాంటి సమస్య ఉన్న వాళ్లు బొప్పాయి తినే ముందు వైద్యుడ్ని సంప్రదించడం మేలు.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(నోట్: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)