Cardiac Arrest: ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల గుండె వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారు..?

Cardiac Arrest: ప్రఖ్యాత హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ బుధవారం గుండెపోటుకు గురయ్యారు. 58 ఏళ్ల రాజు శ్రీవాస్తవ జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు తేలికపాటి గుండెపోటుకు గురయ్యాడు...

Cardiac Arrest: ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల గుండె వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారు..?
Cardiac Arrest
Follow us

|

Updated on: Aug 11, 2022 | 6:48 PM

Cardiac Arrest: ప్రఖ్యాత హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ బుధవారం గుండెపోటుకు గురయ్యారు. 58 ఏళ్ల రాజు శ్రీవాస్తవ జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు తేలికపాటి గుండెపోటుకు గురయ్యాడు. ఆ తర్వాత అతన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. వర్కౌట్ సమయంలో రాజుకి గుండెపోటు వచ్చింది. కానీ ఆయన పరిస్థితి బాగా లేదు. 40-50 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో ఆకస్మిక గుండెపోటు రావడం అనేది పెరిగిపోతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం.. గుండెపోటులు, స్ట్రోక్‌లు సాధారణంగా తీవ్రమైన సంఘటనలు. అంటే ప్రాణాంతకమైన సంఘటనలు. ముఖ్యంగా గుండె లేదా మెదడులోకి రక్తం ప్రవేశించకుండా నిరోధించే అడ్డంకుల కారణంగా గుండెపోటు సంభవిస్తుంది. ముఖ్యంగా 60 ఏళ్లలోపు వారిలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. దీని వల్ల సిద్ధార్థ్ శుక్లా, పునీత్ రాజ్ కుమార్, రాజ్ కౌశల్ వంటి 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ప్రముఖులను ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురూ ఆరోగ్యకరమైన జీవనశైలి, ఫిట్‌నెస్‌ వంటివి పాటిస్తారు. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

వ్యాయామం చేసే సమయంలో గుండెపోటు:

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా ఫోర్టిస్ హాస్పిటల్స్ డైరెక్టర్ మరియు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజ్‌పాల్ సింగ్ మాట్లాడుతూ.. గుండెపోటుకు అనేక కారణాలు ఉన్నాయి. జీవనశైలి, మధుమేహం, ధూమపానం, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులకు సంబంధించిన జన్యుపరమైన కారకాలు వంటివి ఉండవచ్చన్నారు. SRL డయగ్నోస్టిక్‌ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ అభా సాభికి మాట్లాడుతూ.. ప్రజలు ఎక్కువ వ్యాయామం చేయడం కూడా ఆరోగ్యానికి హానికరమని, అధిక వ్యాయామం కార్డియాక్ టిష్యూలో ఆక్సిజన్ డెట్ ని కలిగిస్తుంది. ఇది కార్డియాక్ అరిథ్మియా, మరణానికి దారి తీస్తుంది అని అన్నారు.

అథెరోస్క్లెరోసిస్ ఆకస్మిక గుండెపోటుకు కారణమవుతుందా?

మాయో క్లినిక్ ప్రకారం.. అథెరోస్క్లెరోసిస్ అనేది ధమని గోడలలో, వాటిపై కొవ్వు, ఇతర పదార్థాలు చేరడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ నిర్మాణాన్ని ప్లేక్ అంటారు. ఇది ధమనులపై ఎఫెక్ట్‌ చూపుతుంది. ఇది మీ రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. రక్తం గడ్డకట్టడానికి కారణమయ్యే ఫలకం కూడా చీలిపోతుంది. కాలానుగుణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన ఆహారం, గుండె సంబంధిత లక్షణాలపై అవగాహన ఉండటం చాలా ముఖ్యం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి