- Telugu News Photo Gallery Period bloating if bloating happens during periods add these healthy foods in your diet
Period Bloating: పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరంగా ఉంటుందా..? వీటిని తినండి
Period Bloating: చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరం సమస్యను ఎదుర్కొంటారు. ఈ కారణంగా కడుపులో నొప్పి, తిమ్మిరి ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో పీరియడ్స్..
Updated on: Aug 11, 2022 | 2:21 PM

Period Bloating: చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరం సమస్యను ఎదుర్కొంటారు. ఈ కారణంగా కడుపులో నొప్పి, తిమ్మిరి ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో పీరియడ్స్ సమయంలో ఉబ్బరం సమస్యతో ఇబ్బంది పడే మహిళలు తమ ఆహారంలో అనేక రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చుకోవడం వల్ల ఎంతో మేలంటున్నారు వైద్య నిపుణులు. మహిళలు ఏయే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలో తెలుసుకుందాం.

కివి: కివిలో ఎసిటినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు ఉబ్బరాన్ని పోగొట్టడానికి ఇది పనిచేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో నీరు కూడా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే ఉబ్బరాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

క్యాప్సికం:-ఇందులో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది ఉబ్బరం నుండి ఉపశమనం అందించడానికి పనిచేస్తుంది. పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరం ఉంటే, మహిళలు కూడా క్యాప్సికంను డైట్‌లో చేర్చుకోవచ్చు.

నీరు ఎక్కువగా తాగాలి: పీరియడ్స్ సమయంలో పుష్కలంగా నీరు తాగాలి. ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగంగా ఉంటుంది. రోజుకు 7 నుండి 8 గ్లాసుల నీరు తాగాలి. తగినంత నీరు తాగడం వల్ల ఉబ్బరం సమస్య నుండి ఉపశమనం పొందడమే కాకుండా మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

ఆకు కూరలు: పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరం వల్ల ఇబ్బంది పడుతుంటే, ఆకు కూరలను ఎక్కవగా తినండి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది పీరియడ్స్ సమయంలో వచ్చే ఉబ్బరాన్ని దూరం చేస్తుంది.




