AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కారు దొంగ కోసం వెతుకుతున్న పోలీసులకు షాకింగ్‌ సీన్‌..! టెడ్డీ బేర్‌ వింత చెష్టలు..

కారు చోరీకి పాల్పడినట్లు ఓ యువకుడిపై ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో వెతికినా ఆచూకీ లభించలేదు. చుట్టుపక్కలంతా గాలించారు. అకస్మాత్తుగా, పోలీసుల దృష్టి..

Viral News: కారు దొంగ కోసం వెతుకుతున్న పోలీసులకు షాకింగ్‌ సీన్‌..! టెడ్డీ బేర్‌ వింత చెష్టలు..
Teddy Bear
Jyothi Gadda
|

Updated on: Aug 11, 2022 | 6:37 PM

Share

కారు చోరీకి పాల్పడినట్లు ఓ యువకుడిపై ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో వెతికినా ఆచూకీ లభించలేదు. చుట్టుపక్కలంతా గాలించారు. అకస్మాత్తుగా, పోలీసుల దృష్టి అతడి ఇంట్లోని ఓ గదిలో ఒక వైపు ఉంచిన పెద్దగా కనిపించిన ఒక టెడ్డీ బేర్‌పైకి వచ్చింది. అది ఊపిరి పీల్చుకుంటుంది.! దాంతో అనుమానం వచ్చిన పోలీసులు దొంగను పట్టుకున్నారు. బ్రిటన్ (యునైటెడ్ కింగ్‌డమ్) పోలీసులు దొంగను పట్టుకున్న ఈ ఫన్నీ సంఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ‘టెడ్డీ బేర్ దొంగ’ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అసలు వివ‌రాల్లోకి వెళితే,..

యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఓ కారును దొంగిలించిన‌ వ్యక్తి గురించి గ్రేటర్ మాంచెస్టర్ పోలీసుల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాని ప్రకారం, 18 ఏళ్ల జాషువా డాబ్సన్ ఈ ఏడాది మే నెల నుండి పోలీసులకు దొర‌క్కుండా త‌ప్పించుకు తిరుగుతున్నాడు. అత‌డు ఓ కారును దొంగిలించి, పెట్రోల్ బంక్‌లో డ‌బ్బులు క‌ట్ట‌కుండా పెట్రోల్ నింపుకొని పారిపోయాడు. గత నెల, పోలీసు అధికారులు అతడి అడ్ర‌స్ క‌నుక్కొని, అరెస్టు చేయడానికి వెళ్లారు..అయితే, అత‌ని ఇంట్లో ఎవ్వ‌రూ లేరని, ఆ తర్వాత ఏం జరిగిందో పోలీసులు వివరించారు..

ఇవి కూడా చదవండి

“మేము అతనిని అరెస్టు చేయడానికి వెళ్లాము. డాబ్సన్‌ను కనుగొనే ముందు మా అధికారులు ఒక పెద్ద ఎలుగుబంటి ఊపిరి పీల్చుకోవడం గమనించారు!”. షాకైన పోలీసులు విష‌యం ఏంట‌ని గ‌మ‌నించే స‌రికి 18 ఏళ్ల ఈ అతి తెలివి దొంగ ఆ 5 అడుగుల టెడ్డీ బేర్‌లో దాక్కున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. దొంగ‌త‌నం, మోసం నేరాలు మోపి శిక్ష విధించగా, అతడు ఇప్పుడు కటకటాల పాల‌య్యాడు. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చూసిన నెటిజ‌నులు ‘ఐడియా బాగుంది కానీ వ‌ర్కౌట్ కాలేదంటూ’ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. మొత్తనికి వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా