AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మాజీ ఉద్యోగుల కోసం బోరుమని ఏడ్చిన సీఈఓ.. అసలు విషయం తెలిస్తే మాత్రం మనోడిని తిట్టకుండా ఉండలేరు..

Viral News: అతనో పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవో. అమెరికాకు చెందిన హైపర్‌ సోషల్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నాడు. అంతటి హోదా ఉన్న వ్యక్తి ఉద్యోగుల కోసం బోరుమని ఏడ్చేశాడు. తాను ఎందుకు ఏడుస్తున్నాడో తెలుపుతూ...

Viral News: మాజీ ఉద్యోగుల కోసం బోరుమని ఏడ్చిన సీఈఓ.. అసలు విషయం తెలిస్తే మాత్రం మనోడిని తిట్టకుండా ఉండలేరు..
Narender Vaitla
|

Updated on: Aug 11, 2022 | 6:38 PM

Share

Viral News: అతనో పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవో. అమెరికాకు చెందిన హైపర్‌ సోషల్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నాడు. అంతటి హోదా ఉన్న వ్యక్తి ఉద్యోగుల కోసం బోరుమని ఏడ్చేశాడు. తాను ఎందుకు ఏడుస్తున్నాడో తెలుపుతూ లింక్డిన్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే పోస్ట్‌ చూసిన నెటిజన్లు మాత్రం అతనిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అసలు విషయం తెలిస్తే మీరు కూడా తిట్టకుండా ఉండలేరు. ఇంతకీ ఆ సీఈఓ చేసిన పనేంటి.? అతన్ని ఎందుకు తిడుతున్నారనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం దిశగా వెళుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాలో మాంద్యం లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. బడా సాఫ్ట్‌వేర్ కంపెనీలు సైతం ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన హైపర్‌ సోషల్‌ అనే కంపెనీలో చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపించారు. ఉద్యోగులను తొలగించిన తర్వాత ఆ కంపెనీ సీఈఓ బ్రాడెన్‌ వాలేక్‌ లింక్డిన్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

తాను ఉద్యోగులను తొలగించడానికి గల కారణమేంటో తెలుపుతూ ఏకంగా ఏడ్చేశాడు. తాను ఏడుస్తున్న సమయంలో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. కంపెనీ ప్రస్తుతం అందిస్తోన్న ప్రొడక్ట్‌ను ఆపేసి మరో కొత్త ప్రొడక్ట్‌ను లాంచ్‌ చేసిందని, అందులో భాగంగానే ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. తనను తాను నిందించుకుంటూ ఉద్యోగులపై వ్యవహరించిన తీరుకు పాశ్చతాప్యపడ్డారు. అలాగే.. ‘ఏ కంపెనీ సీఈఓ అయినా ఇలాగే కఠిన హృదయంతో ఉంటారు, ఉద్యోగులను తొలగించాల్సిన సమయం వస్తే ఎలాంటి వాటిని పరిగణలోకి తీసుకోరు. ఉద్యోగిని ప్రేమిస్తున్నానని చెప్పడం వృత్తిపరమైన పని కాదని నాకు తెలుసు’ అంటూ రాసుకొచ్చాడు.

మండి పడుతోన్న నెటిజన్లు..

అయితే సీఈఓ ఏడుపును చూసిన నెటిజన్లు మాత్రం అతడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అదంతా మొసలి కన్నీరు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఉద్యోగులను నిర్దాక్షణ్యంగా తొలగించి ఇప్పుడు ఏడుస్తున్నాడు అంటున్నారు. లాభాలు వచ్చే సమయంలో ఉద్యోగులతో పని చేయించుకుంటారు, అవసరం తీరగానే ఇలాగే తొలగిస్తారంటూ మండి పడుతున్నారు. ఈ వ్యవహారం అంతా చూశాక మీరు కూడా సదరు సీఈఓను తిట్టుకుంటున్నారు కదూ!

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ACని పదేపదే ON/OFF చేస్తున్నారా? కరెంట్ బిల్లు కోసం అసలు టెక్నిక్
ACని పదేపదే ON/OFF చేస్తున్నారా? కరెంట్ బిల్లు కోసం అసలు టెక్నిక్
బోర్డుకే మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చిన బంగ్లాదేశ్ కెప్టెన్
బోర్డుకే మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చిన బంగ్లాదేశ్ కెప్టెన్
ఆ హీరో చెప్పిన ఒక్క మాట నా జీవితాన్నే మార్చేసింది.
ఆ హీరో చెప్పిన ఒక్క మాట నా జీవితాన్నే మార్చేసింది.
ఆ ఊరి తోటలో గోనె సంచి మూట నుంచి దుర్వాసన.. దగ్గరకెళ్లి చూడగా షాక్
ఆ ఊరి తోటలో గోనె సంచి మూట నుంచి దుర్వాసన.. దగ్గరకెళ్లి చూడగా షాక్
ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందే ఆ టీమ్స్ నుంచి ముగ్గురు జంప్
ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందే ఆ టీమ్స్ నుంచి ముగ్గురు జంప్
వినాయక మండపాలు ఏర్పాటు చేసిన భక్తులకు బంపర్ ఆఫర్
వినాయక మండపాలు ఏర్పాటు చేసిన భక్తులకు బంపర్ ఆఫర్
ఆ హీరో మమ్మల్ని ఎత్తుకొని పెంచాడు..ఇప్పుడు లేరంటే నమ్మలేకపోతున్నా
ఆ హీరో మమ్మల్ని ఎత్తుకొని పెంచాడు..ఇప్పుడు లేరంటే నమ్మలేకపోతున్నా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఒకేసారి రూ.10 లక్షలు..!
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఒకేసారి రూ.10 లక్షలు..!
రూ.40,000 లోపు ఏ ల్యాప్‌టాప్ కొనాలి? బెస్ట్‌ ఆప్షన్స్‌ ఇవే..!
రూ.40,000 లోపు ఏ ల్యాప్‌టాప్ కొనాలి? బెస్ట్‌ ఆప్షన్స్‌ ఇవే..!
ఆ ఫీచర్‌ను వెంటనే ఆపేయండి..ర్యాపిడో, ఓలా, ఊబర్‌కు కేంద్రం ఆదేశాలు
ఆ ఫీచర్‌ను వెంటనే ఆపేయండి..ర్యాపిడో, ఓలా, ఊబర్‌కు కేంద్రం ఆదేశాలు