Viral Video: బావిలో పడ్డ పాము కోసం యువతి సాహసం..! నెట్టింట ప్రశంసల వర్షం..

ఈ వీడియోలో ఒక మహిళ బావిలో పడ్డ పామును రక్షించే ప్రయత్నం చేస్తోంది. లోతైన బావిలో పడి తప్పించుకోలేక పోయిన పామును రక్షించడానికి ఆమె..

Viral Video: బావిలో పడ్డ పాము కోసం యువతి సాహసం..! నెట్టింట ప్రశంసల వర్షం..
Snake 1
Follow us

|

Updated on: Aug 11, 2022 | 6:00 PM

Viral Video: పాము అనగానే మనలో భయంపుడుతుంది. పాము పేరు వింటే చాలు చాలామంది నిద్రలో సైతం ఉలిక్కిపడతారు. ఎక్కడైనా అది కనిపించిందంటే.. వెంటనే పరుగు అందుకుంటారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే షాకింగా ఉంటాయి. అందులోనూ పాముల వీడియోలు మరింత వైరల్‌ అవుతున్నాయి. అలాంటి వీడియోలు కొన్ని అతి భయంకరంగా కూడా ఉంటాయి. అయితే, ఈ భయాన్ని అధిగమించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అంతే కాదు, ఆపదలో చిక్కుకున్న పాములకు సహాయం చేసే వారు కూడా ఉంటారు..అలాంటి ఒక వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ బావిలో పడ్డ పామును రక్షించే ప్రయత్నం చేస్తోంది. లోతైన బావిలో పడి తప్పించుకోలేక పోయిన పామును రక్షించడానికి ఆమె పెద్ద సాహసమే చేసింది. ఆమె మొదట ఒక చెక్క కర్రకు తీగను చుట్టి బావిలోపలికి దింపుతుంది. పాము అదృష్టవశాత్తూ ఆ కర్రను పట్టుకుంది.. దాంతో ఆమె నెమ్మదిగా కర్రను పైకి లాగడం ప్రారంభించింది. క్రమంగా పామును బావి నుండి పైకి లాగి దాని ప్రాణాలను కాపాడుతుంది. ఆమె పామును ఒక సీసాలో వేసి అడవిలో విడిపించింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో వైరల్‌గా మారింది మరియు ప్రజలు ఆమె ధైర్యం, మూగజీవాలను రక్షించాలనే ఆమె ఔదార్యాన్ని ప్రశంసించారు.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ